ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం..యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ప్రేమ పేరుతో దాడులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రేమిస్తున్నానని వెంట పడడం..కాదనడం తో దాడులకు పాల్పడడం చేస్తున్నారు. ఇలా చేసిన వారికీ పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న మార్పు రావడం లేదు. ఇప్పటికే ఎన్నో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఎల్బీనగర్‌లో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేసాడు.

ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో బస్వరాజు అనే యువకుడు..యువతీ ఫై కత్తితో దాడి చేశాడు. హస్తినాపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు. శిరీష్ ఫై 18 సార్లు కత్తితో దాడి చేసాడు. దీంతో శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.