అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని

న్యూఢిల్లీ: పీఎస్ ఎల్వీ – సీ52మిషన్ విజయవంతం అవ్వడంపై ప్రధాని మంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఉపగ్రహాలతో వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్ , భూమిపై జరిగే మార్పులు, వరదలు వంటి విపత్తుల్లో నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో నేడు నిర్వహించిన పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/