ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు..

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

Protests-Delhi
Protests-Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఈశాన్య ప్రాంతాల్లో రెండురోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. మౌజ్ పూర్, జఫ్రాబాద్, భ్రహ్మపురి ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. సోమవారం భారత్‌లో ట్రంప్ పర్యటన నేపథ్యంలో అల్లర్లు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు. ఓ హెడ్ కానిస్టేబుల్ సహా ఇప్పటివరకు ఆరుగురు ఈ అల్లర్ల కారణంగా మృతిచెందారు. మరో 50 మంది వరకు గాయాలపాలయ్యారు. 45మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గాయపడ్డ వారిలో డీజీపీ స్థాయి అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా తెల్లవారుజాము నుంచే నిరసనకారులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. మరోవైపు ఢిల్లీలో శాంతి భద్రతలపై అర్థరాత్రి వరకు హోంమంత్రి అమిత్ ఫా సమీక్ష నిర్వహించారు. అమిత్ షా సమీక్షలో ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు జఫ్రాబాద్ సీలంపూర్‌లో మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల రోడ్డుపై బైటాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈశాన్య ప్రాంతాల ఎమ్మెల్యేలు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఢిల్లీలో ఉండటంతో…ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో 144సెక్షన్ విధించారు. స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/