రాష్ట్రానికి పట్టిన ‘జగన్ మోహిని’ని పారద్రోలుతాం: తెదేపా శ్రేణులు

రాష్ట్రంలో తిరిగి ధర్మ పాలనను తీసుకువస్తాం

TDP protests in support of Chandrababu-

Amaravati: చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 33వ రోజు నిరసనలు కొనసాగాయి. ఆలయాలు, చర్చిలు, మసీదులలో చంద్రబాబు నాయుడు క్షేమం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ చేస్తున్న ఆమరణ మూడవ రోజుకు చేరుకుంది. శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆర్.సి.ఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడపలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో టీడీపీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్ అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పేరు మీద అర్చన చేసి ప్రత్యేక పూజలు చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో ఉన్న చర్చిలో ప్రార్థన్లు నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

  • సైకో జగన్ కి శిక్ష పడేలా చేస్తాం
  • చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 33వ రోజు కొనసాగిన నిరసనలు
  • ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు

మాధవరం సి.ఎస్.ఐ చర్చిలో ఇంఛార్జ్ పార్లకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ప్రార్థన్లు చేశారు. నూజివీడు నెహ్రూ పేటలోని సి.ఎస్.ఐ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చిలో నిర్వహించిన ప్రార్థనలలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ తలపెట్టిన తొమ్మిది రోజుల నవగ్రహ శాంతి హోమం లో భాగంగా నాలుగవ రోజు జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి సత్యనారాయణమూర్తి, సుభాషిని దంపతులు పీటలపై కూర్చుని హోమం నిర్వహించారు. నందిగామ పట్టణం 16వ వార్డు దుర్గా నగర్ నందు దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహిళ నేతలు తెదేపా శ్రేణుల బృందంతో కలిసి ఇంఛార్జ్ తంగిరాల సౌమ్య శ్రీ కనకదుర్గ దేవిని దర్శించుకుని రాష్ట్ర ప్రజానీకం నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్నారని నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకూడదని, చంద్రబాబు పూర్తి ఆరోగ్యవంతులుగా ప్రజాక్షేత్రంలోకి రావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

TDP protests in support of Chandrababu

నార్పల మండలం చాములూరు గ్రామం మసీద్ లో రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో అద్దంకి నియోజక వర్గంలో ఎనిమిది రోజుల నుండి కొనసాగుతున్న సైకిల్ యాత్ర ఆదివారం బల్లికురవ మండలం వల్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి అంబడిపూడి ,గుంటుపల్లి,కొత్తపాలెం మీదుగా బల్లికురవ లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. ప్రజలను చైతన్య పరుస్తూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ 10కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర జరిగింది. అనంతపురం అర్బన్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో లలితా సహస్రనామాలను చదువుతూ పూజలను నిర్వహించారు. అనంతరం తెలుగు మహిళల ఆధ్వర్యంలో దర్గా మరియు చర్చలో ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు క్షేమం కోరుతూ పర్చూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పర్చూరు టూ కోటప్పకొండకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు చేపట్టిన సైకిల్ యాత్ర పులివెందుల నియోజకవర్గంలోకి అడుగుపెట్టగా పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, మర్రెడ్డి జోగిరెడ్డిలు ఘనస్వాగతం పలికారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/