‘గోడలు కాదు బ్రిడ్జిలను నిర్మించండి’..రాహుల్
Rahul Gandhi
న్యూఢిల్లీ: మోడి సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలకు దిగిన ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు, ముళ్లతీగలను ఏర్పాటు చేయడం పట్ల రాహుల్ విరుచుకుపడ్డారు. నగర సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాట్లలో ఉపయోగించిన బారికేడ్లు, ఇనుప తీగలతో కూడిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసిన రాహుల్ ‘గోడలు కాదు బ్రిడ్జిలను నిర్మించండ’ని ప్రభుత్వానికి సూచించారు.
వ్యవసాయ చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనలకు నిరసనకారులు పెద్దసంఖ్యలో తరలిరాకుండా ఘజీపూర్ బోర్డర్ సహా నగర సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు పెద్దసంఖ్యలో బారికేడ్లను, ఇనుపతీగలను ఏర్పాటు చేయడంతో పాటు బస్‌లను అడ్డుపెట్టారు. ఢిల్లీయూపీ బోర్డర్లో జరుగుతున్న రైతుల నిరసనలను పర్యవేక్షించేందుకు ఢిల్లీ పోలీసులు డ్రోన్లతోనూ నిఘా పెంచారు. మరోవైపు రైతు నిరసనలకు కేంద్రమైన ఢిల్లీహర్యానా బోర్డర్ సింఘులో సైతం భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో సిమెంట్‌తో కట్టిన గోడను పోలీసులు అమర్చారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/