బ్రిటన్‌ రాజు చార్లెస్-3కి చేదు అనుభవం

బ్రిటన్ రాజ దంపతులపై గుడ్లతో దాడి

protester-hurled-at-least-three-eggs-on-king-charles-iii-and-camilla

లండన్ః బ్రిటన్ రాజు చార్లెస్-3కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి ఆయనపై గుడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో అందరూ విస్తుపోయారు. ఇంగ్లండ్‌లోని యార్క్ నగరంలో నిర్వహించిన ఓ సంప్రదాయ వేడుకకు రాజు చార్లెస్-3 తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన వారితో రాజు కరచాలనం చేస్తుండగా ఊహంచని ఘటన చోటుచేసుకుంది.

జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి మూడు గుడ్లు విసిరాడు. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రాజదంపతులు కూడా షాక్‌తో కాసేపు అక్కడే నిలబడిపోయారు. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజుపై గుడ్ల దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఈ ఏడాది సెప్టెంబరులో మరణించడంతో నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/