తిరుమల కొండపై జై అమరావతి .. మంత్రి రోజాకు నిరసన సెగ

Protest for Roja on Tirumala Hill

తిరుమలః తిరుమల కొండపై వైఎస్‌ఆర్‌సిపి మంత్రి రోజాకు నిరసన సెగ తగిలింది. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత… అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగుతూనే… జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే… ‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది’ అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు.