పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం

సామాజిక వనాలను ప్రోత్సహించాలి

protect the environment
protect the environment

కొవిడ్‌-19 వైరస్‌జీవి ప్రకృతి నుండి పుట్టినది. ఇది అమితశక్తి ప్రభావం కలిగి ఉంటుంది. దీనిని నిర్మూలించాలంటే ప్రకృతి ద్వారానే దీని నివారణ జరగాలి. కావ్ఞన విశ్వమానవాళి యావత్తు ప్రకృతిని పరిరక్షిస్తూ, అలాగే వృక్షసంపదను పెంచి, సామాజిక వనాలను ప్రోత్సహించాలి.

ఈ జగత్తంతా ప్రకృతి ఆధారంగా అనాదిగా యేర్పడినది. ఈ ప్రకృతి అనేది మానవాళికి అందించిన అద్భుత మైన కానుక. ఆధునిక మానవ్ఞడు శాస్త్రీయ విజ్ఞానంవైపు ఎంత గానో పురోగమించి, అత్యంత ఆధునిక పరిశోధనలకు ఆద్యుడై నాడు. కాని తన ఎదురుగా కనిపించే ప్రకృతిలోని అంతర్గతవిజ్ఞాన శాస్త్రాలను ఆకళింపు చేసుకోలేదు.

పంచభూతాలు అంటే ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి. ఈ ఐదింటి కలయికయే ప్రకృతి. ప్రకృతి అనాది దైనందిన జీవితంలో ప్రతిసంఘటనకు దాని ఫలితానికి ‘కార్యకారణ సంబంధం ఉంటుంది.

ప్రపంచ మానవాళికి నిజ జీవితంలో అనేక అనారోగ్యకరమైన ‘కరోనావైరస్‌ లాంటి జటిలసమస్యలు ఏర్పడి ప్రపంచ యావత్తు మరణఘంటికలు మ్రోగిస్తున్నవి.

నేటి ఆధునిక మానవ సమాజం యాంత్రిక జీవనానికి అలవాటుపడి, విజ్ఞాన ఆర్థిక సముపార్జనలలో మునిగితేలుతూ ప్రకృతి ఏది ప్రధాన భూమిక పోషిస్తుందనే అంశాన్ని ఏమాత్రం గుర్తింపు గైకొనలేదు. మానవాళికి సంకల్పస్వేచ్ఛ ఉన్నది.

ఆలోచించే శక్తి ఉన్నది. విచక్షణ చేయగలబుద్ధి ఉన్నది. మరెందుకు సమాజంలో నిజాయితీ లోపించినది? మనకు నిజజీవితంలో అనేక రకాల జటిలసమస్యలు ఎదురవ్ఞతుంటే అలాంటి సమస్యలకు గల కార్య కారణ సంబంధాన్ని అర్థం చేసుకొని వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయవచ్చు.

ఏది వాస్తవంగా ఉన్నదో దానిని గురించి తెలుసుకోవడమే ప్రధానమైన అంశం. ఆలోచించడానికి ఆధారం తప్పక ఉండాలి. ఊహించడానికి కూడా ఏదో ఒక భౌతిక ఆధారం కావాలి.ఆలోచించడానికి ఏదైతే అనుభవరూపంలో ఉన్నదో అది అంటే దానిని ‘కార్యమని తెలుసుకొని ‘కారణాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి.

ఆచరణకు పనికిరాని సిద్ధాంతం సిద్ధాంతం కానేకాదు. ప్రతిదానిని పరీక్షించి పరిశీలించి ఆచరణకుపక్రమించ డానికి ప్రయత్నించడం తనతోపాటు యావత్‌ మానవ సమాజానికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.

పర్యవసానంగానే సూక్ష్మాతిసూక్ష్మ రేణువుతో కూడిన జీవి నేటి ‘కరోనావైరస్‌ విశ్వ వ్యాప్తంగా నిలిచి మానవాళితో మరణఘంటికలు మ్రోగిస్తున్నది. ఈ సూక్ష్మజీవి రేణువ్ఞ 2019 అక్టోబరు మధ్యభాగంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఉద్భవించి నెమ్మదిగా మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.

ఆ పరిసర ప్రాంతాల్లోని నిపుణులైన వైద్యులు గాని, వైద్యపరిశోధనా సంస్థల (డయోగ్నస్టిక్‌ సెంటర్స్‌) పరిశీకులుగాని, మందుల దుకాణం విక్రయదారులు కాని ఈ వ్యాధిబారిన పడిన రోగులుకాని ఈనాటి ప్రమాదకరమైన ‘కొవిడ్‌- 19 వైరస్‌ జీవిగా గుర్తించలేకపోయారు.

పైన ఉదాహరింపబడిన వారందరు ప్రతి సంవత్సరం రుతుమార్పు ముగింపుదశలోని సీజనల్‌ సాధారణ వైరస్‌ జీవిగా భావించారు. అందరూ కూడా అదే ఆలోచనతో భావించారు. అలాంటి భావనతోనే సరిపెట్టుకు న్నారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైనది.

మానవాళి చేసే అనేక తప్పిదాల వలన ప్రకృతికి ఎన్నో రకాలైన కానరాని నష్టాలు సంభవిస్తున్నవి. వీటిని గుర్తించి పరిగణనలోకి తీసుకొనకపోవట చేతనే ఈనాటి భయంకరమైన కరోనా వైరస్‌ విశ్వవ్యాప్తంగా ప్రవేశించి మానవ మారణహోమా నికి తార్కాణంగా నిలిచింది.

దశలవారీగా లాక్‌డౌన్‌లు, క్వారంటైన్‌లు, భౌతికదూరం, శరీరపరిశుభ్రత పరీక్షా పరికరాల కొనుగోలు, నోటిమాస్కులు, చిత్తశుద్ధితో కఠినంగా అనుసరించి పాటించినప్పటికీ రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదే కాని ఏ మాత్రం స్వల్పంగానైనా తగ్గుట లేదు.

విజ్ఞానశాస్త్రంలోని శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి జరిగినప్పటికినీ నేటి ‘కరోనా వైరస్‌ వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తామని, ఈ వైరస్‌ క్రిములను మానవాళి నుండి దూరంగా పారద్రోలుతామని ఉత్తరకుమార ప్రగల్భాలను పోలిన మాటలు విటుంటే నీటిలోని మాటలమూటలుగా తెలుగుసామెత జ్ఞప్తికి వస్తున్నది.

ఇది అమితశక్తి ప్రభావం కలిగి ఉంటుంది. దీనిని నిర్మూలించాలంటే ప్రకృతి ద్వారానే దీని నివారణ జరగాలి. కావ్ఞన విశ్వమానవాళి యావత్తు ప్రకృతిని పరిరక్షిస్తూ, అలాగే వృక్షసంపదను పెంచి, సామాజిక వనాలను ప్రోత్సహించాలి.

‘ప్రకృతి నుండి కరోనా వైరస్‌ని తరిమివేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు ఎందరో పలుకుతూనే ఉంటే బుద్ధిహీనం, అజ్ఞానం, హాస్యాస్పదం. పర్యావరణ పరిరక్షణే ప్రపంచ మానవాళి ధ్యేయం కావాలి.

  • వాసిరెడ్డి రామకృష్ణ ప్రసాదు

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/