పోలీసు ఎన్కౌంటర్లో వికాస్‌దూబే హతం
తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించిన దూబే

కాన్పూర్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వికాస్ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారు కాన్పూర్ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడగానే వికాస్ దూబే పరాిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో అతను హతమయ్యాడు. గ్యాంగ్‌స్టార్ వికాస్ దూబేను అరెస్టు చేయడానికి డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలో పోలీసులు కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామానికి జూన్ 3న వెళ్లారు. అరెస్టుకు సంబంధించి అప్పటికే సమాచారం అందడంతో దూబే ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దూబే అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/