నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి: దస్తగిరి

Protect me and my family: Dastagiri

కడప: ఎంపీ అవినాష్‌ రెడ్డి కుటుంబసభ్యుల అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘పులివెందుల వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు, అవినాష్‌ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. అవినాష్ రెడ్డి అనుచరులు నాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలి’’ అని ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు.