జగన్ పాలనలో అన్నింటికీ హాలిడేనేః బిజెపి నేత విమర్శలు

రాష్ట్రాన్ని హాలిడే ప్రదేశ్ గా మార్చారని వ్యాఖ్యలు

bjp-leader-satya-kumar-comments-on-ys-jagan

అమరావతిః బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ‘హాలిడే సీఎం’గా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో పరిశ్రమలకు పవర్ హాలిడే, వ్యవసాయానికి క్రాప్ హాలిడే, ప్రజలకు కరెంట్ హాలిడే, పాలనకు పెరాలసిస్ హాలిడే, ఉద్యోగులకు జీతాల హాలిడే… అంటూ సత్యకుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ హాలిడే ప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ సీఎం ఇంద్రభవనానికే పరిమితం అయ్యారని వ్యాఖ్యానించారు.