హోలీ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి హంగామా

బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏంచేసినా అది వైరల్ కావాల్సిందే. సభలో మాట్లాడిన , అసెంబ్లీ లో మాట్లాడిన , రోడ్డెక్కిన , వేదిక ను పంచుకున్న..ఇలా సందర్భం ఏమైనా సరే..మంత్రి మల్లారెడ్డి అంటే ఓ ప్రత్యేకం అన్నట్లు ఉంటుంది. తాజాగా ఈరోజు హోలీ వేడుకల్లో తనదైన స్టయిల్ లో హంగామా చేసి వార్తల్లో నిలిచారు. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్న , పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి ..మేడ్చల్ లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

అక్కడ యువతతో కలిసి డీజే టిల్లు పాటకు, చిరంజీవి వాల్తేరు వీరయ్యలోని ‘బాస్ వెర్ ఈజ్ ద పార్టీ ’పాటకు స్టెప్పులేశారు. అక్కడున్న వారు సైతం మల్లారెడ్డితో కలిసి స్టెప్పులేసి ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి డాన్సులు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ మధ్య తన కాలేజీ ఫంక్షన్ లోను డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు తో కలిసి మల్లారెడ్డి స్టెప్స్ వేసి వార్తల్లో నిలిచారు.

YouTube video