ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి రాజు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా దొరస్వామిరాజు ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్ల్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు. వి.ఎం.సి(విజయ మల్లీశ్వరి కంబైన్స్‌) పేరు మీద సినీ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసును ప్రారంభించి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి సీడెడ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా ఈయన పేరు పొందారు. 1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/