తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 206 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ ఈరోజు ఉదయం వెల్లడించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇద్ద‌రు మృతి చెంద‌గా, 1579 మంది మ‌ర‌ణించారు. రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,872 చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4,049గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో 346 మంది డిశ్చార్జి కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 2,86,244 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో 2,281 మంది ఉన్నారు. నిన్న జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 45 కేసులు న‌మోదు అయ్యాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/vides/