జైల్లో బండి సంజయ్ కి ఎలాంటి భోజనం పెట్టారంటే..

పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయినా బండి సంజయ్..ప్రస్తుతం కరీంనగర్ జైలు లో ఉన్నారు. ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం పూట ఇడ్లీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు టమోటా, రసం ఇచ్చారు. అంతేకాదు.. ఎలాంటి టెస్ట్ చేయకుండానే ఆయనకు ఆహారం ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు. అయితే, బండి సంజయ్‌కు ఆహారం విషయంలో కోర్టు నుంచి తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు రాలేదన్నారు.

ఇదిలా ఉంటె జైల్లో బండి సంజయ్ ని చూసి భార్య , పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం.. ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ లో భాగంగాలో జైలులో ఉన్న భర్తను కలిసిన భార్య అపర్ణ.. ఉద్వేగానికి గురయ్యారు. అర్థరాత్రి ఇంటికొచ్చి బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో.. ఆమె అక్కడే ఉన్నారు. 24 గంటల తర్వాత భర్తను జైలులో కలవటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తండ్రిని జైలులో చూసిన కుమారుడు సైతం ఉద్వేగానికి గురయ్యాడు. బండి సంజయ్ భార్య, పిల్లలను ఓదార్చారు. కుట్రపూరితంగానే జైలులో పెట్టారని.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని కుటుంబానికి దైర్యం చెప్పారు.