తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ

రక్షాబంధన్ సందర్బంగా తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. తోబుట్టువుల క్షేమమే రాఖీ పండుగ పరమార్థమని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ. రక్షాబంధన్ సందర్బంగా తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. తోబుట్టువుల క్షేమమే రాఖీ పండుగ పరమార్థమని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ.

ఆడబిడ్డల సంక్షేమం కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పారని స్పష్టం చేసిన బాలకృష్ణ.. తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, బాలికా విద్యకు ప్రోత్సాహం, ఉపాధికి పెద్దపీట, డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళా సాధికారత మొదలగు వంటివన్నీ ఆడబిడ్డల అభ్యున్నతి కోసమేనన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్​లో కూడా మహిళాభ్యున్నతికి పాటుపడటమే అందరి కర్తవ్యమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

అన్నా చెల్లెళ్ల అనురాగానికి చిహ్నం రాఖీ పర్వదినమని.. తోబుట్టువుల క్షేమం కోరుతూ.. ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటూ రక్షగా నిలిచే పండుగ అని చెప్పుకొచ్చారు. అందుకే నందమూరి హీరోల సినిమాలలో తోబుట్టువుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా సందేశం ఉంటుందని బాలకృష్ణ వెల్లడించారు.

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. దసరా బరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.