గాడ్ ఫాదర్ ట్రైలర్..కుమ్మేసింది

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్.

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక.. అన్నీ రంగులు మారతాయి..’ అని పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే.. రాష్ట్రంలోని రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ ట్రైలర్ చూపించారు. సీఎం కుర్చీ ని దక్కించుకునేందుకు ఎవరెవరు ఎలా పావులు కదుపుతున్నారు.. వాటిని బ్రహ్మ (చిరంజీవి) ఎలా అడ్డుకున్నారు అనేది ‘గాడ్ ఫాదర్’ కథగా తెలుస్తోంది.

‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’ ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. అలాగే మూవీ లో నయనతార కీలక పాత్రలో కనిపించగా.. సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. బ్రహ్మ వెనుక మా పార్టీ లేదు అని నయన్ చెప్పడం.. చిరంజీవి ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం.. పోలీసులపై తిరగబడటం.. ఖైదీ డ్రెస్సులో ఫైట్ చేయడం వంటివి ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో ట్రైలర్ చివర్లో చిరంజీవి ఇంట్రెన్స్ గా నడుచుకుంటూ వస్తుండగా.. సల్మాన్ ఖాన్ అడ్డొచ్చిన రౌడీలను ఊచకోత కొస్తూ కనిపించాడు. అలానే ఇద్దరూ మెషిన్ గన్స్ తీసుకొని ఫైరింగ్ చేయడం చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే సినిమా చాల ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.