హిమాచల్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

సలోన్‌ః హిమాచల్‌ప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల సందండి మొదలైంది. ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుగానే ప్రచారం షురూ చేస్తున్నది. పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా ఈరోజు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే పనిలో ఉన్నారు.
ఉదయాన్నే హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ప్రియాంకాగాంధీ.. సలోన్‌లోని మాతా షూలినీ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సాయంత్రం సలోన్‌లోనే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ఞా ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఆమె హిమాచల్‌లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/