నిడదవోలులో ఉద్రిక్తత పరిస్థితి

నిడదవోలు గణేష్‌ సెంటర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర ను వైస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం మరోసారి వేడిపుట్టిస్తుంది. అమరావతినే రాజధానిని చేయాలనీ అక్కడి రైతులు , టిడిపి పట్టుపడుతుంటే, వైస్సార్సీపీ శ్రేణులు మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపిస్తూ అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బ్రిడ్జి వద్దకు పాదయాత్ర చేరుకోగానే వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటు అయిన జేఏసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. మూడు రాజధానులు ముద్దు.. ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు స్లొగన్స్ ఇచ్చారు. అలాగే వైస్సార్సీపీ నేతలు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. దీంతో ఇరు వర్గాలు పోటా పోటీగా నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల పాదయాత్ర పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు జేఏసీ, వైసీపీ నేతలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు. ఇదే క్రమంలో రైతులు కూడా జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతుల పాదయాత్రలో టీడీపీ నేతలు పీతల సుజాత, కొల్లు రవీంద్ర, గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.