కామారెడ్డి జిల్లాలో బయటపడ్డ ఎంపీసీటీ రాసలీలలు..

కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీసీటీ రాసలీలలు బయటపడ్డాయి. నాగిరెడ్డిపేట మండలంలోని ఒక గ్రామ ఎంపీటీసీ, అదే గ్రామానికి చెందిన వివాహితతో అడవిలో రాసలీలలు సాగిస్తుండగా..కొంతమంది యువకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంతమంది యువకులు అడవి పందుల నుంచి పంటలు కాపాడుకోవడానికి కాపలాగా వెళ్తున్న సమయంలో చెట్ల పొదల్లో నుండి మాటలు వినిపిస్తుండడం తో అక్కడికి వెళ్లి చూడగా.. ఓ మహిళతో గ్రామ ఎంపీటీసీ రాసలీలలు కొనసాగిస్తున్నాడు. యువకులను చూసి ఖంగారు పడిన ఎంపీటీసీ ..తన అనుచరులను అక్కడికి రప్పించుకొని యువకుల ఫై దాడికి ట్రై చేసారు.

యువకులు భయపడి గ్రామంలోకి వెళ్లి ఎంపీటీసీ రాసలీలలు గురించి అందరికీ చెప్పారు. దీంతో గ్రామస్తులు అందరూ ఆ గుడిసె దగ్గరకు చేరుకుని ఎంపీటీసీని నిలదీయడంతో తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తనను మోసం చేసి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తనకు అక్కర్లేదని ఆమె భర్త పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆ మండలంలో సంచలనంగా మారింది.