భారత్ లో 11కు చేరిన కరోనా మరణాలు
మధురైలో 54 ఏళ్ల వ్యక్తి మృతి

New Delhi: దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్య 11కు పెరిగింది .
తమిళనాడులో బుధవారం కరోనా కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు.
కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/