ప్రపంచ వ్యాప్తంగా 16, 231 మృతులు

195 దేశాలపై కరోనా పడగ

Corona Virus over 195 countries

కరోనా మృతుల సంఖ్య పెరుగుతొంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలపై కరోనా పడగ విప్పింది. బుధవారం ఉదయం  నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 16, 231కి చేరింది.

3లక్షల 72వేల 757 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో కరోనా తీవ్రత అధిగంగా ఉంది.

యూరోపియన్ దేశాలలో పది వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు. దాదాపు 2లక్షల మంది కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/