ప్లాస్మా డొనేట్ చేసేందుకు దాతాలు రండి

YouTube video

న్యూఢిల్లీ: సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో దేశంలోనే మొద‌టి క‌రోనా ప్లాస్మా బ్యాంకును ప్రారంభించామన్నారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు వ‌చ్చేవారికంటే ప్లాస్మా అవ‌స‌రమ‌ని వ‌చ్చే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని కేజ్రివాల్ చెప్పారు. ప్లాస్మా దాత‌ల కొర‌త నేప‌థ్యంలో అర్హ‌త‌లున్న ప్ర‌తి ఒక్క‌రూ ప్లాస్మా దానం చేయ‌డానికి ముందుకు రావాల‌ని సిఎం విజ్ఞ‌ప్తి చేశారు. వ్యాక్సిన్ వచ్చేంతవరూ కరోనాకు సరైన ట్రీట్‌మెంట్ లేదు. అయితే ప్లాస్మా థెరపీ చికిత్స సత్ఫలితాలను ఇస్తూ పేషెంట్ల పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతోంది’ అని కేజ్రీవాల్ చెప్పారు. గత నాలుగైదు రోజుల నుంచి ప్లాస్మాకు డిమాండ్ పెరిగిందని, అయితే ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చే వాళ్ల కొరత ఉందని చెప్పరు. డోనర్ల సంఖ్య పెరగని పక్షంలో ప్లాస్మా సరఫరా పడిపోతుందని అన్నారు. కరోనా నుండి కోలుకున్న పేషెంట్లు ప్లాస్మా ఇచ్చి సమాజానికి నిస్వార్థ సేవ చేయాలని కోరారు. ప్లాస్మా ఇచ్చే వారికి ఎలాంది బాధ, బలహీనత ఉండదని వివరించారు. కాగా, దేశ రాజధానిలో ఇంతవరకూ కోవిడ్19 కేసులు 99,444 నమోదై కోటికి చేరువలో ఉన్నాయి. 3,067 మంది మృత్యువాత పడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/