అసలు మీది మగజాతేనా? అంటూ రంగంలోకి దిగిన పూనమ్ కౌర్

ఇండస్ట్రీ లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. రెండు రోజుల క్రితం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వైసీపీ ఫై చేసిన కామెంట్స్ ..ఇప్పుడు ఆయన్ను విమర్శల పాలుచేస్తుంది. వైసీపీ నేతలే కాదు ఇండస్ట్రీ వ్యక్తులు సైతం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణ మురళి దారుణంగా పవన్ ఫై బూతులు మాట్లాడారు. అక్కడి తో ఆగకుండా పంజాబీ అమ్మాయి ని మోసం చేసారంటూ మీడియా ముందు పెద్ద బాంబ్ పేల్చారు.

పంజాబీ అమ్మాయి అనగానే అంత కూడా పూనమ్ కౌర్ పేరు బయటకు తీశారు. ఇక వైసీపీ అభిమానులు కొంతమంది పూనమ్ కౌర్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఒక అభిమాని అయితే ‘ఏదైనా విశేషం ఉందా? పవన్ కళ్యాణ్‌తో’ అని ట్వీట్ పెట్టగా.. పూనమ్ కౌర్ తనదైన శైలిలో స్పందించింది.

‘మీరు అందరూ కలిసి అందరి ముందు మీ రాజకీయ లబ్ధి కోసం మీ లెవల్‌కి తగ్గేట్టు టీవీ ముందు చేయించారుగా పెళ్లి.. అందుకుని ఈరోజు వరకూ గుడ్ న్యూస్ లేదు.. ఆడవాళ్లని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారుగా.. అసలు మీది మగజాతేనా? అని ప్రశ్నించింది పూనమ్ కౌర్.

ఆమె రిప్లైపై తిరిగి ఆ వైసీపీ అభిమాని రియాక్ట్ అవుతూ.. ‘పీకే గారు ఏమి చేసినా దేశం కోసం ధర్మం కోసమే చేస్తారు మేడమ్.. దయచేసి మీ దేవుడ్ని అర్థం చేసుకోండి’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్స్ తో పూనమ్ పేరు మీడియా లో మళ్లీ వైరల్ గా మారింది.

Meeru andaru Kalisi andari Mundu me political benefit kosam , me level ki taggetatu tv mundu cheincharu ga pelli …andukani ee roju waraku good news ledu , aada wala ni inka addu pettukuntu rajikiyalu chestunnaru ga … maga jaati aa meeru ?— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 26, 2021