మరో కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్‌

గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారుల‌పై నిషేధం ఎత్తేసిన బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు ద‌ర‌ఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్ట‌కుండా గ‌త ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని బైడెన్ ఎత్తేశారు. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కుల‌ను కాపాడేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్రంప్ అప్ప‌ట్లో చెప్పారు. అయితే ట్రంప్ చెప్పిన కార‌ణం స‌రైన‌ద‌ని కాదు అని తాజా ప్ర‌క‌ట‌న‌లో బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఈ ఆంక్ష‌లు అమెరికా వ్యాపారాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీశాయ‌ని బైడెన్ చెప్పారు. ట్రంప్ తీసుకొచ్చిన ఎన్నో ఇమ్మిగ్రేష‌న్ విధానాల‌ను తాను రివ‌ర్స్ చేస్తాన‌ని ఎన్నిక‌ల సంద‌ర్భంగా బైడెన్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయ‌న ఈ తాజా నిర్ణ‌యం తీసుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/