హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలు తోమర్ కు అప్పగింత

president-ramnath-kovind-accepted-harsimrat-kaur-badal-resignation

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది. నిన్నటివరకూ హర్ సిమ్రత్ కౌర్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు అప్పగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం ఆమె రాజీనామాను ఆమోదించినట్లు ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలియజేశారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖను అదనపు బాధ్యతగా చూడాలని ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ ను రాష్ట్రపతి కోరారు.

కాగా, నిన్న పార్లమెంటులో ఎన్డీయే సర్కారు వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టగా, ఆది నుంచి వీటిని వ్యతిరేకిస్తూ వచ్చిన శిరోమణి అకాలీదళ్, మరోసారి తన అసంతృప్తిని తెలియజేసింది. గతంలో ఆర్డినెన్స్ లుగా వచ్చి, ఇప్పుడు ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు బిల్లులు వచ్చాయి. వీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు ఎస్ఏడీ విప్ ను కూడా జారీ చేసింది. అయినప్పటికీ, లోక్ సభలో తనకున్న బలంతో బిజెపి వీటిని సులువుగా నెగ్గించుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అకాలీదళ్.. కేంద్రంలో మంత్రిగా ఉన్న పార్టీ అధినేత సుఖ్ బీర్ బాదల్ భార్య, హర్ సిమ్రత్ చేత తన పదవికి రాజీనామా చేయించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/