సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసన..నేతల ముందస్తు అరెస్టులు

అమరావతి: పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసనగా సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా సీపీఐ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి సీపీఐ నేతలు ప్రయత్నించడంతో సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా సీపీఐ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సెక్రటేరియట్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/