ఉపశమనం పేరుతో చిక్కులొద్దు

చర్మ సంరక్షణ- జాగ్రత్తలు

అందాన్ని పెంచుకోవటానికి మొటిమలు, మచ్చలు పోగొట్టుకోవటానికి చాలా ప్రయోగాలు చేస్తుంటాం. వాటివలన మంచి జరిగితే పర్వాలేదు.. కానీ చర్మానికి చేటు చేస్తే? అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

Skin Care.. Precautions

చెంపలు, కనుబొమ్మలపై బ్లష్ కి బదులుగా చాలా మంది లిప్స్ టిక్ ను వాడుతుంటారు.. రంగులు, మెరుపులు ఎక్కువగా ఇష్టపడని వార్ చేసే పని ఇది. కానీ దీనివలన చర్మ రంద్రాలు మూసుకుపోయి దురదలు, మొటిమలు , ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనికి బదులుగా బ్లష్ లోనే లేదా రంగులను ఎంచుకుంటే ఈ సమస్యా ఉండదు.

మొటిమలు వచ్చినపుడు చాలా మంది ఉపయోగించే చిట్కా టూత్ పేస్ట్ రాయటం.. దీనివల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా తర్వాత చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి.. మలినాలను చర్మ రంధ్రాల నుంచి బయటకు రాకుండా టూత్ పేస్ట్ కప్పేస్తుంది. దాని ప్రభావం తగ్గిన వెంటనే చర్మ వ్యాధులు మొదలవుతాయి.. దీనికి బదులుగా వేపాకు ఎండబెట్టి పొడి చేసి దానిలో తేనె కలిపి మొటిమలు వున్నా చోట రాస్తే సరి.

ముఖం నిగనిగలాడాలన్నా , బయట నుంచి వచ్చాక చర్మంపై పేరుకున్న దుమ్మూ , ధూళీ పోవాలన్నా నిమ్మ కాయను ఎక్కువగా వాడుతుంటాం.. దానిలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజ క్లైన్సర్ గా ఉపయోగపడుతుందని నమ్ముతాం. కానీ నిమ్మ రసాన్ని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు. తేనె , శెనగపిండి , పెరుగు లాంటి వాటిల్లో కలిపే రాయాలి.. లేదంటే అనవసరమైన సమస్యలు కొన్ని తెచ్చుకున్న వాళ్లమవుతాం.

వంటా సోడాని కూడా కొందరు నేరుగా రాస్తారు.. అలా చేయకూడదు.. దేనిలోనైనా కలిపే చర్మానికి పట్టించాలి. లేదంటే దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/