హుస్నాబాద్‌లో ఉద్రిక్తత : ప్రజాప్రతినిధులపై భూనిర్వాసితుల దాడి

గౌరవెల్లి భూనిర్వాసితుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన హుస్నాబాద్ బంద్… మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు తమ గోడు పట్టడంలేదంటూ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు భూ నిర్వాసితులు. Sky 247పై ఇప్పుడే జాయిన్ అవ్వండి రూ.10,247 మీ సొంతం చేసుకోండి* ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి యత్నించారు. కర్రలు, పైపులతో టీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడి చేశారు.

ఈ క్రమంలో లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పునరావాసం ప్యాకేజీ కొన్నాళ్లుగా గూడాటిపల్లి వాసులు ఆందోళన చేపట్టారు. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయమంటే తమపైనే దాడులు చేస్తున్నారని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం.. మాటలకే పరిమితమవుతోందని మండిపడుతున్నారు. కాగా, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మరోపక్క దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు . గౌరవెల్లి భూ నిర్వాసితులపై సీఎం కేసీఆర్​కర్కశంగా వ్యవహరిస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి మెప్పించాలి కానీ.. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని నిలదీశారు.