సోనియా తో పీకే భేటీ..

కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి తీసుకొచ్చారు. వరుసగా సోనియా..ప్రశాంత్ తో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రక్షళనకు పీకే సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనకు హై కమాండ్ ను ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా ప్రశాంత్ కిషోర్ ఇష్టాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గత మూడు రోజుల్లో సోనియాను పీకే కలవడం ఇది రెండో సారి. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై వీరు చర్చలు జరిపినట్టు సమాచారం.

గత శనివారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిషన్ 2024పై ఆయన విశ్లేషణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని, గెలుపు కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పారు. యూపీ, ఒడిశా, బీహార్ లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని తెలిపారు. మరోవైపు పీకే సూచనలపై ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది.