కాంతారా సినిమా ఫై సూపర్ స్టార్ రజని కామెంట్స్

ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కాంతారా మూవీ ఫై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ‘మనకి తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఆ విషయాన్ని సినిమాల ద్వారా హోంబలే ఫిలిమ్స్ కంటే ఎవరూ గొప్పగా చెప్పలేరు. కాంతార మూవీ చూస్తున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రైటర్, డైరెక్టర్, యాక్టింగ్‌లో రిషబ్ శెట్టి స్కిల్స్‌కి హ్యాట్సాప్. ఇండియన్ సినిమాకి మాస్టర్ పీస్‌ లాంటి సినిమా తీసిన టీమ్ మొత్తానికీ అభినందనలు’ అని తెలిపారు.

ఇక ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కన్నడ లో విడుదలైన కాంతారా…అక్కడ సూపర్ హిట్ తెచ్చుకొని , ఆ తర్వాత తెలుగు , హిందీ పలు భాషల్లో విడుదలైంది. కేవలం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ..వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సినీ లవర్స్ చూడడం జరిగింది. ఈ సినిమాను చూడాలని సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోడీ సైతం కాంతారా సినిమాను చూడాలని ఫిక్స్ అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 14న ప్రధాని మోడీ ‘కాంతారా’ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో తిలకించనున్నారు.