‘మా’ పోలింగ్ లో వైసీపీ కార్య కర్తను ఎలా అనుమతించారంటూ కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్ లేఖ

‘మా’ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితాలు రావడం..మంచు విష్ణు ప్యానల్ గెలవడం జరిగినప్పటికీ..ప్రకాష్ రాజ్ మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యవహారం బయటకు తీసుకొస్తూనే ఉన్నాడు. విష్ణు ప్యానెల్ గెలిచిన త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్ ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌గా, ఆయ‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన స‌భ్యులంద‌రూ కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఎన్నిక‌లు స‌జావుగా జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ ఆరోప‌ణ‌లు చేసింది. ఆ త‌ర్వాత విష్ణు మంచు చేసే మంచి ప‌నుల‌ను గ‌మ‌నిస్తామ‌ని అన్నారు. ఆ తర్వాత ఎన్నిక‌ల సీసీటీవీ ఫుటేజ్ తెలుసుకునేందుకు ట్రై చేసారు.

ఇక ఇప్పుడు ‘మా’ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు జోక్యం చేసుకుందంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు లేఖ రాశారు. వైకాపా పార్టీ కార్య‌క‌ర్త నూక‌ల సాంబ‌శివ‌రావును ఎన్నిక‌ల ప్రాంగ‌ణంలోకి ఎలా అనుమ‌తించారంటూ ఆయ‌న ఎన్నిక‌ల అధికారిని ఈ సందర్భంగా ఆయన ప్ర‌శ్నించారు. జ‌గ్గ‌య్య పేట‌కు చెందిన సాంబ‌శివ‌రావ‌ర‌కు క్రిమిన‌ల్ రికార్డ్ ఉంద‌ని, అలాంటి వ్య‌క్తి ఎన్నిక‌ల ప్రాంగ‌ణంలోకి ఎలా వ‌చ్చాడ‌ని, ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో సాంబ‌శివ‌రావు అనే వ్య‌క్తి ‘మా’ స‌భ్యుల‌ను బెదిరించార‌ని ప్ర‌కాశ్ రాజ్ తెలిపారు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌ను కోరారు. అలాగే విష్ణు మంచుతో నూక‌ల సాంబ‌శివ‌రావు ఉన్న ఫొటోల‌ను ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. త్వ‌ర‌లోనే వీడియోల‌ను కూడా బ‌య‌ట పెడ‌తాన‌ని తెలిపారు.

#MaaElections2021 .. dear Election officer Krishna mohan garu .. this is just the beginning.. give us the CC footage.. we will let the world know what happened.. how the elections were conducted #justasking pic.twitter.com/ew8waPyAXN— Prakash Raj (@prakashraaj) October 22, 2021