జగన్ కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులు ఉన్నారు

అమరావతి: మంత్రి పదవి కోసమే ఇంత కాలం పాటు టీడీపీ నేతలను కొడాలి నాని తిట్టారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. త్వరలోనే ఆయన పదవి పోతోందని చెప్పారు. రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే వైసీపీకి చుక్కలు చూపిస్తామని అన్నారు. ఆ ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ ఆఫీసును మూసేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ కే కాదు… గాంధీని చంపిన గాడ్సేకు కూడా అభిమానులు ఉన్నారని అన్నారు. తాము కూడా ఉప్పూకారం తింటున్నామని… బీపీ వైస్సార్సీపీ వాళ్లకే కాదు మాకు కూడా వస్తుందని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/