ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాకమునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు.

ఆ తరువాత భారత్ కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవెగౌడ్ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు వచ్చిన దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో, ప్రజ్వల్ దిగొచ్చాడు. అయితే, రేవణ్ణ గతంలో రెండు సార్లు భారత్ కు వాయిదా వేసి టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.