సమన్వయలోపమే ఇక్కట్లకు కారణం

‘ఒక్కమాట’ (ప్రతి శనివారం)

Migrant laborers
Migrant laborers

తెలంగాణ నుండి వందలాది మంది సరిహద్దు దాటివెళ్లి షాపుల ముందు క్యూ కట్టారు. అవసరం మేరకు మందు బాటిళ్లు కొనుగోలు చేసుకుని బాటిల్‌తోసహా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేశారు.

వీరికి ఏ పాస్‌లూ లేవు. వాస్తవంగా చూస్తే ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. మొన్నటివరకూ రెండు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి.

వ్యాపార సంబంధాలు, సంబంధ బంధవ్యాలు ఒకటేమిటి అన్నివిధాలుగా కలిసిమెలిసి ఉన్నారు. సరిహద్దులు దాటకుండా కట్టడి చేయడం అనేది సాధ్యమయ్యే పనికాదు.

ఒక రాష్ట్రం ఇచ్చిన పాస్‌లు మరొక రాష్ట్రం అంగీకరించకపోవడంకూడా ప్రజల దృష్టిలో రెండు రాష్ట్రాల అధికారులూ చులకనవుతారు.

పాస్‌లు ఇచ్చేటప్పుడే తెలంగాణ ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతాధికారులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి పాస్‌లు ఇస్తే.. ఇద్దరికీ గౌరవంగా ఉంటుంది.

అంతేకాదు అవసరమైతే రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఒక కమిటీ వేసి, నియమ నిబంధనలు రూపొందించి ఆ కమిటీ నిర్ణయం మేరకు పాస్‌లు ఇస్తే.. సమంజసంగా ఉంటుంది.

అంతేకానీ నిబంధనల పేరుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకొనకపోవడం, ఆదుకోవాలనే చిత్తశుద్ధిలేకపోవడం దురదృష్టకరం.

ప్రజలు తమకోసం తాము ఎన్నుకునేది ప్రజాస్వామ్య ప్రభు త్వం. దాని లక్ష్యం ప్రజా సంక్షేమం. సంక్షేమమంటే తిండి, గుడ్డ, గూడే కాదు వాటితోపాటు వైద్య, విద్య, భద్రత తదితర అంశాలు ఎన్నో కలిసి ఉన్నాయి.

ప్రజలందరికీ జీవించే హక్కు ప్రసాదించింది మన రాజ్యాంగం. సాధ్యమైనంతవరకూ ప్రజలు కష్టనష్టాలకు గురికాకుండా రాజ్యాంగ పరిధిలో వ్యవహరిస్తూ సేవ లు అందించాల్సిన గురతరబాధ్యత ప్రజాపాలకులపై ఉంచారు మన రాజ్యాంగ నిర్మాతలు.

ఇప్పుడే కాదు స్వాతంత్య్రం వచ్చినప్ప టి నుంచి కొన్నిసార్లు విధులు నిర్వహించడంలో పాలకులు విఫల మవ్ఞతున్నారేమోననిపిస్తున్నది.

అసమర్థత, అలక్ష్యం, లేక అవినీ తో, కారణాలు ఏమైనా, బాధ్యత విస్మరిస్తున్నట్లు కొన్ని సందర్భా ల్లో స్పష్టమవుతున్నది. కరోనా సృష్టిస్తున్న విలయంనుంచి ప్రజ లను ముఖ్యంగా నిరుపేదలు ఇబ్బందులుపడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో పాలకులు కొంతమేర విఫలమయ్యారనే చెప్పొచ్చు.

కరోనాను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మందులు, మాకులు ఏమీలేవ నేది వాస్తవం. ముందుజాగ్రత్తలతో మాత్రమే నియంత్రించవచ్చు ననేది కూడా యధార్థం. మన దేశం లోని కేరళ ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల కారణంగా ఆ రాష్ట్రంలో ఈ మహ మ్మారిని దాదాపు నియంత్రించగలిగారనే చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోకూడా కొంతమేరకు ముఖ్యంగా కరీంనగర్‌ జిల్లాలో తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా కట్టడి చేయగలిగారు. అదే హైదరాబాద్‌లో నియంత్రించలేకపోతున్నారు. ఇక వలస కార్మికుల విషయంలో బాధ్యత కలిగిన కేంద్రం, మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినతీరు అత్యంత బాధాకరం.

దీంతో కోట్లాది మంది వలస కార్మికులు పడిన, పడుతున్న ఇక్క ట్లు మాటలకు అందవ్ఞ. కరోనా వైరస్‌ ఏదో రాత్రికి రాత్రి ఒక్క సారిగా వచ్చి విరుచుకుపడలేదు. చైనాలోని వూహన్‌లో డిసెంబరు చివరి వారంలో పుట్టింది.

అక్కడ నుంచి క్రమేపీ ఇతర దేశాలకు విస్తరించింది. మనదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా జనవరి 30న కేరళ రాష్ట్రంలో బయటపడింది. దేశంలోకి ప్రవేశి స్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.

అప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరికలమీద హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నది. కేరళరాష్ట్రం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. కానీ కేంద్రంతోసహా అనేక రాష్ట్రా లు దీన్ని గురించి అంతగా పట్టించుకోలేదు.

మార్చి మొదటివారం నాటికే దేశంలో విస్తరిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన కేంద్రం మార్చి 22న జనతాకర్ఫ్యూతో చర్యలు ప్రారంభించి ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రకటించి దశలవారీగా అమలుచేయడం మొదలుపెట్టింది.

లాక్‌డౌన్‌ను విధించడంలో తప్పుపట్టలేదు. కరోనావైరస్‌కు మందులేదు. భౌతికదూరంలాంటి ముందు జాగ్రత్తలేతప్ప మరో మార్గంలేదు. అందుకు లాక్‌డౌన్‌ ఒక్కటేమార్గం.

అయితే ఈ లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు రెండు రోజుల సమయం ఇచ్చి ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రారంభించి ఉంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు కలిగేవి కావ్ఞ. ఇదేమీ పెద్దనోట్ల రద్దు విషయం లాగా రహస్యంగా మూడోకంటికి తెలియకుండా ఉంచా ల్సిన పనిలేదు.

ఆ సంగతి అలా వదిలిపెడితే ప్రకటించినతర్వాత కూడా తీసుకోవాల్సిన చర్యల విషయంలో కూడా అంత సమర్థ వంతంగా, సమన్వయంతో వ్యవహరించ లేకపోయారేమోననిపిస్తు న్నది.

కేంద్రంవద్ద నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ ఉన్నట్లు కన్పించదు. అసలు ఎంతమంది వలస కార్మికులున్నారు? చిన్నా చితకా పరి శ్రమల్లో మరెంతమంది కార్మికులున్నారు? వారి పరిస్థితి ఏమిటి? వారికి తిండి, గూడు ఎలా? తదితర అంశాలు పరిగణనలోకి తీసుకున్నట్లుకానీ, పట్టించుకున్నట్లుకానీ కన్పించదు.

ఇంటి నుండి బయటకు కాలుపెట్టవద్దని చెప్పారేకానీ ఆ ఇంట్లోనే ఉంటే తిండి, తిప్పల సంగతి ఏమిటి? ఎలా ఉండగలుగుతారు?

ఇరుకుగదుల్లో కదిలీకదలకుండా రోజుల తరబడి నివాసంచేయడం సాధ్యమేనా? తదితర అంశాలు ఆలోచించినట్లు కన్పించదు. భారత దేశానికి సంబంధించినంత వరకూ ఆ మాటకువస్తే మానవాళికి ఈ వైరస్‌ కొత్త కాదు. కరోనా మొదలుకాదు.

దాదాపు ఐదు వేల యేళ్లక్రిత మే చైనాలో హమీన్‌మంఘాఅనే గ్రామంలో అంటువ్యాధి వ్యాపిం చి మొత్తం గ్రామాన్నే తుడిచిపెట్టేసింది

. క్రీ.పూ. 430లో ఎథెన్స్‌ లో విస్తరించిన ప్లేగువ్యాధి తన ఉనికిని మొదటిసారిగాతెలిపింది. ప్లేగు, తర్వాత ఎన్నో సార్లు ప్రపంచ మానవాళిపై దాడులుచేసిం ది. ఒకరు, ఇద్దరు కాదు. కోట్ల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పో యారు.

1918- 1920 స్పానిష్‌ఫ్లూ కూడా ప్రజారోగ్యంపై తన ప్రతాపాన్ని చూపింది. ఆరు కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పో యారు.

ఆ తర్వాత మశూచి, కలరా, ఆసియన్‌ఫ్లూ, ఎబోలా, స్వైన్‌ఫ్లూ, సార్స్‌, జికా తదితర అంటువ్యాధులు భారత దేశంలో ప్రజా రోగ్యంపై తీవ్రప్రభావం చూపాయి. కోట్లాదిమంది అస్వస్థ తకు గురయ్యారు. మరెందరో ప్రాణాలు కోల్పోయారు.

అలాంటి అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకోకపోవడం దురదృష్ట కరం. ఇక వలస కూలీలు ఎంతమంది ఉన్నారు? కార్మికులు ఎం దరు? రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేదలు ఎంతమంది ఉన్నా రు? ఎక్కడెక్కడ ఉన్నారు?

క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జర పకుండా లాక్‌డౌన్‌తో ఇళ్లకే కట్టడి చేయడంతో ఆ వర్గాలకు ఇబ్బం దులు ఆరంభమయ్యాయి. మొత్తం మీద మొదటి దశ లాక్‌డౌన్‌ లో ఓపికగానే ఇళ్లకో, లేకవారు పనిచేస్తున్న స్థలంవద్దనో పరిమిత మయ్యారు. కానీ ఆ తర్వాత కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమించింది.

లాక్‌డౌన్‌ను పొడిగించడంతో వలస కూలీల్లో ఓపిక నశించి స్వగ్రామాలకువెళ్లి తమ వారిని చూ డాలనే ఆరాటం, హోంసిక్‌ రోడ్లపైకి నడిపించింది. ఆందోళన చేప ట్టారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై తిరగబడ్డారు. చేసేదిలేక పోలీసులు లాఠీచార్జీ చేయాల్సివచ్చింది.

ఎవరెన్ని చెప్పినా వినే పరిస్థితి లేకుండాపోయింది. ‘మా సొంత గ్రామాలకు పంపండి. కలో గంజో తాగి అక్కడే బతుకుతాం అని వందలాది కిలోమీ టర్లు కాలినడకన బయల్దేరిపోయారు.

మార్గమధ్యంలో వారుపడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావ్ఞ. ఎందరో అస్వస్థతకు గురయ్యారు. ఇలా వెళుతూ మార్గమధ్యంలో ప్రసవించిన మహిళలూ ఉన్నా రంటే అర్థం చేసుకోవచ్చు.

కొన్ని ప్రాంతాల్లో వారి వ్యధలు చూసి ఆకలి తీర్చి వాహన సదుపాయం ఏర్పాటు చేసిన దయార్థ హృద యులు కూడా ఉన్నారు. అయితే కొన్నిచోట్ల కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టా యి.

ఇందుకు వారిని నిందించేకంటే రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రాల సరిహద్దులను దాట వద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు.

వాగ్వాదాలు, ఘర్ష ణలు, లాఠీఛార్జీలు, చివరకు వివరాలతో దరఖాస్తు చేసుకుంటే.. పరిశీలించి కరోనావైరస్‌ లేదని నిర్ధారణ చేసుకుని పాస్‌లు (అను మతి పత్రాలు) ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆమేరకు పాస్‌లు ఇచ్చారు.

అయితే ఆ పాస్‌లు ఎక్కడో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లాంటి రాష్ట్రాలు అనుమతించాయి. కానీ పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ అధికారులు మాత్రం ససేమిరా అన్నారు.

అలాని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అందరు అధికారులు అడ్డుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో పాస్‌లతో అనుమతించారు, మరికొన్ని ప్రాంతా ల్లో అనుమతించలేదు.

మొన్న నల్గొండ జిల్లాలో రాష్ట్ర సరిహద్దు లో ఉన్న చెక్‌పోస్టు వద్ద పాస్‌ లతో వెళ్లుతున్న వందలాది మంది ని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన పాస్‌ లతో తాము అనుమతించమని స్పష్టం చేశారు. ఆ రాత్రంతా అక్కడే రోడ్డుపై జగరణ చేయాల్సి వచ్చింది. ఏమైందో ఏమోకానీ ఉదయం పది గంటల ప్రాంతంలో అనుమతించారు.

అన్ని గంట లపాటు రోడ్డుపై ఉంచారు? ఆ తర్వాత ఎందుకు అనుమతించా రో? ఆ పాస్‌హోల్డర్స్‌కుకూడా అర్థంకాలేదు. ఇలా చాలా ప్రాంతా ల్లో, ఆంధ్రా సరిహద్దులో తెలంగాణ నుంచి వెళ్లే విద్యార్థులకు, వలస కూలీలకు ఇక్కట్లు ఎదురయ్యాయి.

పోనీ అలాగని తెలుగు రాష్ట్రాల మధ్య సరి హద్దులు దాటకుండా కట్టుదిట్టం చేస్తున్నారా అంటే అదీ లేదు. మొన్న ఎపిలో ముందుగా మద్యం షాపులను ప్రారంభించారు.

తెలంగాణ నుండి వందలాది మంది సరిహద్దు దాటివెళ్లి షాపుల ముందు క్యూ కట్టారు. అలాగే తెలంగాణాలో మద్యం షాపులు ప్రారంభం కావడం ఆంధ్ర ప్రదేశ్‌కంటే ధరలు తక్కువ కావడంతో పెద్దఎత్తున తరలివచ్చారు.

వీరికి ఏ పాస్‌లు లేవ్ఞ. వాస్తవంగా చూస్తే ఎపి, తెలంగాణ రాష్ట్రాలమధ్య సుదీర్ఘ మైన సరిహద్దు ఉంది. మొన్నటి వరకూ రెండు రాష్ట్రాలూ ఒకటి గానే ఉన్నాయి.

వ్యాపార సంబంధాలు, సంబంధ బంధవ్యాలు ఒకటేమిటి అన్ని విధాలుగా కలిసిమెలిసి ఉన్నారు. సరిహద్దులు దాటకుండా కట్టడి చేయడమనేది సాధ్యమయ్యేపనికాదు.ఒకరాష్ట్రం ఇచ్చిన పాస్‌లు మరొక రాష్ట్రం అంగీకరించకపోవడంకూడా ప్రజల దృష్టిలో రెండు రాష్ట్రాల అధికారులు చులకనవుతారు.

పాస్‌లు ఇచ్చేటప్పుడే తెలం గాణ ఉన్నతాధికారులు ఎపి ఉన్నతాధికారు లతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి పాస్‌లు ఇస్తే ఇద్దరికీ గౌర వంగా ఉంటుంది.

అంతేకాదు అవసరమైతే రెండురాష్ట్రాల ఉన్నతా ధికారులు ఒక కమిటీవేసి, నియమ నిబంధనలు రూపొందించి ఆ కమిటీ నిర్ణయం మేరకు పాస్‌లు ఇస్తే సమంజసంగా ఉంటుంది. అంతేకానీ నిబంధనల పేరుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకొనకపో వడం, ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/