ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Digital Education

డిజిటల్‌ విద్య అందని ద్రాక్షేనా?: – ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, ఇంటర్మీడియేట్‌ తరగతులకు ఆన్‌ లైన్‌ బోధనావిధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాలలో అంతర్జాలం సర్వీసులు మెరుగుపరచడంలో తీవ్ర అలక్ష్యం కనబరుస్తోంది.

డిజిటల్‌ తరగతుల ప్రవాహంలో ముందుకు వెళ్లేందుకుగ్రామీణ విద్యార్థులు,తీవ్ర అవస్థలు పడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు అందుబాటులో లేని లక్షలాది మంది విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందని ద్రాక్షగా మారింది.

ఒక మాదిరి సౌకర్యాలు ఉన్న విద్యార్థులకు, అంతర్జాలం అందుబాటులో ఉండటం లేదు.

ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండే కుటుంబాలలో ఒక్క స్మార్ట్‌ ఫోన్‌తోనే చదువ్ఞలు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది.

పాఠాలు వినడం కోసం కొండలు, గుట్టలు ఎక్కుతున్న కథనాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది.

ప్రజలపై అదనపు భారం:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో 25 శాతం రైలు మార్గాలలో ప్రైవేట్‌, పబ్లిక్‌ భాగస్వా మ్యంలో ప్రాజెక్టులను ఆహ్వానించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైళ్లలో ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపింది.

రైల్వే ట్రాక్‌లు, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్త రైళ్ల ఏర్పాటు తదితర అంశాల లో ప్రైవేటీకరణ తద్వారా అదనపు ఆదాయం కోసం 20 శాతం యుజర్‌ ఛార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనలతో ప్రజల్లో అదనపు భారం పడనుంది.

అంతేకాకుండా భద్రతా రుసుంకింద జనవరి 1నుండి టిక్కెట్లపై ఐదుశాతం పెంచాల న్న ప్రతిపాదన ద్వారా కూడా రైల్వే ఛార్జీలు దేశవ్యాప్తంగా పెరగనున్నాయి.

భద్రత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చడం ప్రభుత్వాల కనీస బాధ్యత.ఇందుకోసం అదనపు భారం ప్రజలపై మోపాలనుకోవడం మంచి ఆలోచన కాదు.

మందుల కొరతను అధిగమించాలి: -జి.రాజేష్‌కుమార్‌, నల్గొండ

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప థ్యంలో అన్ని ఆస్పత్రులు, ప్రభుత్వ మందుల షాపులలో డయాబెటీస్‌, కిడ్నీ, థైరాయిడ్‌, ఇతర వ్యాధి సంబంధిత అత్యవసర మందులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకో వాలి.

ఇప్పటికే కొన్ని పెద్ద నగరాల్లో వ్యాపారులు మందుల కొరత సృష్టిస్తున్నారు.రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మందుల లభ్యతపై నివేదికలు తయారు చేయించాలి. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థల ఆధ్వర్యంలో మందుల గోదాములలో విస్తృతమైన తనిఖీలు చేపట్టాలి.

ఉపాధి అవకాశాలు కల్పించాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

విద్యార్థులలో సృజనాత్మకతను పెంచి వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.

విద్యార్థి దశలోనే స్వయంఉపాధి పొందుతూ,చదువు అనంతరం ఇతరు లకు ఉపాధికల్పించేలా సామర్థ్యంపెంచేందుకు ఎంట్రపెన్యూర్‌ షిప్‌, సృజనాత్మకత, అంకుర సంస్థల ప్రోత్సాహక కేంద్రాలను జిల్లాలవారీగా నెలకొల్పాలి.

అంతేకాక ప్రతీ యూనివర్శిటీ వృత్తి విద్య కళాశాలలు, స్వయం ప్రతిపత్తి కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేసి సిలబస్‌లో భాగంగా చేర్చాలి.

ఆయా కేంద్రాలలో విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు, యువత మహిళలో వ్యవస్థాపక వైఖరికి ప్రోత్సాహం గుర్తించిన ఔత్సా హిక విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, అవసరమైన సూచనలు, సహా యసహకారాలు అందించడం నూతనసాంకేతికతను రూపొం దించి వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేయాలి.

మాతృభాషను ప్రోత్సహించాలి:-ఎన్‌.రామకృష్ణ, గుంటూరు జిల్లా

విద్యారంగంతోపాటు పరిపాలనా, న్యాయ,పరిశోధన తదితర రంగాలలో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కొత్త పదాల సృష్టి జరిగినప్పుడే మాతృభాష పరిరక్షణ సాధ్యం అవుతుంది.

విశ్వ వ్యాప్తంగా సంస్కృతిసంప్రదాయాలకు,మనుగడకు మాతృభాషే పట్టుకొమ్మ.ఎన్ని భాషలను నేర్చుకున్నాపర్వాలేదు కాని మాతృ భాషను విస్మరించడం, కేవలం పరాయి భాషల అధ్యయనం వలనే అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనుకోవడం సరి కాదు

.2017వరకు నోబెల్‌ బహుమతులు పొందినవారిలో 90 శాతానికిపైగా మేధావులు మాతృభాషలోవిద్యనభ్యసించినవారే? ఈనేపథ్యంలో ప్రసార, సమాచార మాధ్యమాలు కూడా మాతృ భాషకువీలైనంత ఎక్కువప్రాధాన్యత ఇవ్వాలి

నగదు కొరత: -కె.రామరాజు, విజయనగరం

రాష్ట్రంలో పలు ఎటిఎంలలో నగదు కొరత ఇంకా వెంటా డుతోంది.ముఖ్యంగా వారాంతాలు,సెలవ్ఞదినాలలో నగదు లభ్యత దుర్లభంగా ఉంటోంది.ఎప్పుడు చూసినా నో క్యాష్‌ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

ఇతర బ్యాంకులు పరిమితి దాటితే సేవచార్జీలు విధిస్తున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు కార్డు స్వైప్‌ చేసాక నగదు బయటకు రావడం లేదు.ఇదివరకు ఆటోమెటిక్‌గా నగదు ఖాతాలో తిరిగి జమ అయ్యే విధానం పనిచేయడం లేదు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/