ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి: – సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తీవ్ర అపారిశుధ్య పరిస్థితులను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి.

వ్యర్థాల సేకరణ, మురికిగుంటల శుభ్రత, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించడం వంటి చర్యలను యుద్ధప్రాతిపదికపై చేపట్టాలి.

గత రెండు నెలల కాలంలో కరోనాతోపాటు కలరా, డయేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వంటి అంటురోగాల వ్యాప్తి పెరగడం వలన జిల్లావాసులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు వ్యాధిపీడితులతో కిట కిటలాడిపోతున్నాయి. వీటిని నివారించేందుకు పారిశుధ్యం మెరుగుపర్చే ప్రణాళికలు చేపట్టాలి.

విరివిగా ఫాగింగ్‌ చేయ డం అపరిశుభ్ర పరిస్థితులపై ప్రత్యేక దృష్టి ఉంచడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాలలో వైద్యశిబిరాల ను విరివిగా నిర్వహించాలి.

చేనుకు చేవ, రైతుకు చట్టం:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

రైతు సంక్షేమంకోసం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలు ముందు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ముఖ్యమై నవి.

ప్రభుత్వంవాటిని అద్భుతమైనవిగా అభివర్ణిస్తుండగా ప్రతి పక్షాలు రైతుల్లో పెక్కుమంది వాటిని ప్రమాదకరమైన వాటిగా భావిస్తున్నారు.

అయితే వారిఆందోళనలో అర్థముంది.ఒక చట్టం మార్కెట్‌ కమిటీలపాత్రను పరిమితంచేస్తూ రైతు తనసరుకును మార్కెట్‌ బయట ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని చెబు తోంది.తద్వారా మార్కెట్‌కమిటీలు రానురాను నిర్వీర్యమవుతాయి.

పోనీ రైతు ఎక్కడో దూరంగా ఉన్న లాభ సాటి బేరానికే అమ్ముకొందామనుకున్నా అక్కడికి తనసరుకు తరలించేదెలా? డిమాండ్‌సరఫరాలనిమార్కెట్‌ నియంత్రిస్తుంది.

తన లాభానికి వాడుకుంటుంది.రైతు బేరమాడగల శక్తి సంపా దించాలంటే ప్రభుత్వసహకారం,మార్కెట్‌పైనియంత్రణ అవసరం.

ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

ఇటీవల కురిసిన వర్షాలకు చాలా గ్రామాలు జలమయం అయ్యాయి. ఈవర్షాలకు అన్ని గ్రామాలు బురదమయంగా మారాయి.

ఈ బురద కారణంగా ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావ్ఞన ప్రతి గ్రామంలో మున్సి పాలిటీలలో అంటువ్యాధులు రాకుండా బ్లీచింగ్‌పౌడర్‌ను ఎక్కువగాచల్లించాలి.

ప్రభుత్వం సైతంగ్రామాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. ప్రజారోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఎల్‌ఆర్‌ఎస్‌ మినహాయింపు ఇవ్వాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరు జిల్ల్లా

రాష్ట్రంలో సొంత ఇంటికల ఇంకా కలగానే మిగిలిపోయింది. పేదవారికి ఇళ్లు కట్టించే పథకం స్వర్గీయ వైయస్‌ఆర్‌ ప్రభుత్వ హయాంలో చక్కని అభివృద్ధి సాధించింది.కాగా తర్వాత పూర్తిగా మందగించింది.

ఇప్పుడు ఇంటి అనుమతి కోసం ఎల్‌ ఆర్‌ఎస్‌ని అమలులోకి తేవడం వలన ఖర్చులు అధికం అవడం తోపాటు సమయం కూడా వృధా అవుతోంది.

సిమెంటు, స్టీలు, ఇసుక, కలప ధరలు బాగా పెరగడంతోపాటు కూలీలు, మేస్త్రీల ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. బ్యాంకుల వడ్డీలు కూడా పెరగడం వలన లోను ద్వారా ఇల్లు కట్టుకోవడం పెనుభారం అవ్ఞతోంది.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లనిర్మాణం విషయంలో ఒక పటిష్టమైన ప్రణాళిక చేపట్టాలి. కనీసం 200 గజాలలోపు ఇళ్ల స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ మినహాయింపు ఇవ్వాలి.

స్వయంసమృద్ధి సాధించాలి:-తిరుమలశెట్టి సాంబశివరావు, గుంటూరుజిల్లా

నేడు కరోనా మహమ్మారి విజృంభణతో పట్టణాలలో ఉపాధి కోల్పోయిబతకుభారమై వలసకూలీలెందరో పట్టణమోజు తగ్గిం చుకొని తమ సొంత పల్లెల బాటపట్టారు.

ఇదిఒక విధంగా మంచిదే. అయితే పెరిగిన వలసలతో గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి పథకాల్లో అందరికి తగినంత ఉపాధి లభించదు. ప్రభుత్వాలు ఉద్దీపనలు ప్రకటిస్తుంటే బడా పారిశ్రామిక వర్గాలే లబ్ధిపొందుతున్నాయి.

ఇకనైనా గ్రామీణ రంగానికి ప్రాధాన్యత పెంచాలి. బ్రెజిల్‌ దేశంలో చక్కెర ఫ్యాక్టరీల నుండి ఉత్పత్తి జరిగే గాసోలిన్‌ వంటి ఇంధనాలను విరివిగా వాహనాలకు విని యోగిస్తారట.

రైతులకు కూడా ఇథనాల్‌, బయో ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా రాయితీలు పెంచాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ఇంధన పొదుపు కోసం చౌక ప్రజారవాణాను ప్రోత్స హించి వ్యక్తిగత వాహనవినియోగాన్ని నియంత్రించాలి.

చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?:-మిథునం, హైదరాబాద్‌

మీ పాలనలో మద్యం ఏరులైపారుతోందని స్వర్ణాంధ్రప్రదేశ్‌ కాస్త మద్యాంద్రప్రదేశ్‌గా తయారయిందని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించి అధికారంలోకి వచ్చారు జగన్‌.

అయితే ఇప్పుడు వారి పాలనలోనుఅదే జరుగుతోంది. ఏరు లా పారటం కాదు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మద్యం నదిలా ప్రవహిస్తోంది.మందుబాబులను ప్రోత్సహిస్తున్నారు.

ఇబ్బ డిముబ్బడిగా వైన్‌షాపులకుబార్లకు అనుమతిలిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/