గిట్టుబాటే సమస్యకు పరిష్కారం

పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు

Agriculture
Agriculture

పార్లమెంట్‌లో మూడు బిల్లులు ఆఘమేఘాలతో పెట్టడం, ఆమోదించుకోవడం పాలకవర్గాల ప్రతిష్ఠగా భావించడం అనైతికం.

ఒకనాడు ఉల్లిధర పెరిగినందువల్లనే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఇది రైతుల ఒక్కరి సమస్యేకాదు.

ఇది భారతదేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ఆహార స్వేచ్ఛ, జీవన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ఈ దేశ ప్రజలు నోటికి ప్రతిరోజు పట్టెడన్నం పెట్టే రైతులకు కష్టం వచ్చింది.

నేడో రేపో వారి పొలం వారిది కాదు, వారి బతుకులకు తూకం వేశారు. పంచభూతాలతో వ్యాపారం చేస్తున్నారు. మనిషి మరణానికి అనేక కారణాలుంటాయి.

కానీ రైతు మరణానికి ఒకే ఒక్కకారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం. గిట్టుబాటు ధర లేకపోవడం.

మన దేశంలో వ్యవ సాయరంగాన్ని నమ్ము కున్న రైతాంగ జీవితాలు ఎంతటి దారుణంగా ఉన్నాయో గత మూడు దశాబ్దాలుగా సుమారు నాలుగు లక్షల మంది రైతుల ఆత్మ హత్యలే నిదర్శనం.

దేశ ఆర్థిక రంగానికి వెన్నుముకగా, సుమారు అరవై శాతానికిపైగా ఈ రంగం లోనే ఆధారపడ్డ దేశ జనాభాకు ఉపాధి, ఉద్యోగ, ఆహార భద్రతలకు ఆయుప్రాయమైన రంగానికి ఆర్థిక జవసత్వాల పట్టం కట్టాల్సిన పాలకులు కరోనా సంక్షో భంలో ఆర్థికంగా అష్టకష్టాలపాలైన రైతుల ఉద్దరణ పేరుతో పాలకులు మూడు బిల్లులను మెజారిటీ బలంతో ఆమోదించుకో వడంపై అన్నదాతల ఆగ్రహజ్వాలలు పల్లెనుండి పార్లమెంట్‌ దాకా ఎగిసిపడుతున్నాయి.

రైతు ప్రయోజనలను కార్పొరేట్‌ పెట్టుబడిదారుల శక్తుల చేతిలో పెట్టడం అప్రజాస్వామ్యం కాదా! ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపి దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఓ నివేదిక తెప్పించి పార్లమెంటులో చర్చలు జరిపి లోటు పాట్లను సవరించి ఓటింగ్‌ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా శాస నంగా మార్చకపోవడంతో పలు సందేహాలకు దారితీస్తూ, పాల కుల చిత్తశుద్ధిని శంకించవలసి వస్తుంది.

ఇందుకు ప్రస్తుత, గత పాలకులు ఇలా ఎన్నో విధానాలతో ప్రజలు, రైతులు మోస పోతున్నారు. కార్పొరేట్‌ పెట్టుబడిదారుల సంస్కృతి సమస్యని సమస్యలా కాకుండా అవకాశంగా చూస్తుంది. పెట్టుబడికి లాభా పేక్షే ధ్యేయంగా మానవీయత భూతద్దం పెట్టి వెతికినా కని పించదు. మనిషి శ్రమను గుర్తించరు. జీవితకాలం నిలువెల్ల దోపిడీ చేయడమే దాని లక్ష్యం. భూమిని విభజించి హద్దులు ఏర్పరచి వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఆకాశహర్మ్యాలు కట్టుతున్నారు. చుక్కమిగలకుండా సముద్రాలను తోడేయాలని చూస్తున్నారు.

ఉపకారం చేయకపోయినా పర్వాలేదు.పరోక్షంగా అపకారం చేయాలని చూస్తున్న సంగతి పాలకులకు తెలియదా! ఇలా నేలను, పంచభూతాలను నాశనం చేసేవారు .

అన్ని రంగాల్లో నింగికి ఎదుగుతున్నారు. నేలను ప్రేమించే రైతుల కుటుంబాలు ఆ నేలలోనే కలిసిపోతున్నాయి. పార్లమెంటులో విలువైన కాలాన్ని రైతు బాగుకోసమో, అభివృద్ధి కోసమో చేయాల్సినవేళ ఇలా వ్యవసాయాన్ని ప్రైవేట్‌రంగానికి కట్ట బెట్టాలని చూడడం మూలంగానే ఇన్నాళ్లు కాలాన్ని గడిపారు.

కానీ గడిచిపోయిన కాలానికి, రైతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూడ్చలేనిదని గమనించాలి. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు కూడా దేశ ప్రజలకు అన్నం పెట్టిన రైతుల విలువలకు కట్టుబడి ఉన్నందువల్ల కఠిక దారిద్రం కౌగిట్లో కాలంచేస్తున్నారు.

విలువలను ధ్వంసం చేసేవాళ్ల వలలో ధనం చిక్కుకొని విలవిల్లాడుతుంది. ఈ ధనమంతా ప్రజలదే కదా! ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా అన్నాన్ని సృష్టించే అన్నదాత మనకు ప్రాణదాత.

ఆయనే అనాదై ప్రాణాలు తీసుకుంటున్న దుర్భరస్థితి నుండి ఏనాడు బయట పడతాడో. ఒకే దేశం, ఒకే మార్కెట్‌ విధానం వ్యవసాయ ఉత్పత్తులు క్రయవిక్రయాలు చేయడం మనదేశానికి పనికిరాదు.

విభిన్న పరిస్థితులు, భౌగోళిక స్థితులు రాష్ట్రాల సమైక్యతతో ఉన్న మనదేశంలో చిన్న చిన్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాలనే వ్యవసాయ ఆర్థికవేత్తలు సూచనలు పాఠించకపోవడం బాధాకరం.

నయా గ్లోబలైజేషన్‌ వ్యాపార వ్యూహాలతో మన బతుకులు ప్రతినిమిషాన్ని శాసించి సొమ్ము చేసుకుంటున్న వేళ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన పాలకులు ప్రధానరంగాలను కార్పొరేట్‌ వ్యవస్థలకు కట్టబెట్టడం ప్రజావ్యతిరేకం.

రైతాంగ ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు వారి హక్కుల రక్షణకై ప్రతిపక్షాలపైనో, రైతు సంఘాలపైనో ఆధారపడాల్సిన విధానాల వలననే రైతులు ఇన్నాళ్లు దుర్భిక్షంలో ఉన్నారు.

ఎన్నికల నాడు ప్రతి పార్టీ నాయకులు హామీలతో ఉద్ధరిస్తూ తామున్నామంటూ పల్లకి మెసే బోయల్లా నటించి అధికారం చేజిక్కాక పాలకులు కార్పొరేట్‌ సేవలో మునిగితేలుతు న్నారు.

ఓట్లు రైతులవి, పెత్తనం పెట్టుబడిదారులదనేలా కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నధనస్వామ్యమే.

మనదేశంలో రైతాంగం వారి పొలంలో వారి ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా బతికే హక్కు హరించడానికి, స్వేచ్ఛా వ్యాపారంలో కార్పొరేట్‌ చేతుల్లో రైతు పండించిన పంటలను పరోక్షంగా పెట్టే విధంగానే ఉంది.

కార్పొరేట్‌ శక్తులు దేశమంతా విస్తరించడానికి ప్రైవేట్‌ వ్యాపారులకు గేట్లు తెరవడానికి ఉపయోగపడుతుందన్న వాదనకు బలం చేకూరుతుంది. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ను యధా తథంగా ఎందుకు అమలు చేయరు.

రైతుల పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారు. పార్లమెంట్‌లో మూడు బిల్లులు ఆఘ మేఘాలతో పెట్టడం ఆమోదించుకోవడం పాలక వర్గాల ప్రతిష్ఠగా భావించడం అనైతికం. ఒకనాడు ఉల్లిధర పెరిగినందువల్లనే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

ఇది రైతుల ఒక్కరి సమస్యేకాదు. ఇది భారతదేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ఆహార స్వేచ్ఛ, జీవన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే.

ఈ దేశ ప్రజలు నోటికి ప్రతిరోజు పట్టెడన్నం పెట్టే రైతులకు కష్టం వచ్చింది. నేడో రేపో వారి పొలం వారిదికాదు, వారి బతుకులకు తూకం వేశారు.పంచభూతాలతో వ్యాపారం చేస్తున్నారు. మనిషి మరణానికి అనేక కారణాలుం టాయి.

కానీ రైతు మరణానికి ఒకే ఒక్కకారణం వ్యవసాయం గిట్టుబాటుకాక పోవడం. గిట్టుబాటు ధర లేకపోవడం. ఇన్నాళ్ల స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వీరి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి.

వారే పంటలు పండించలేమని భీష్మించి కూర్చుంటేఅన్నమో రామచంద్రా అని ఆకలికేకలు వేయాల్సిందే.

-మేకిరి దామోదర్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/