ప్రజావాక్కు
సమస్యలపై ప్రజాగళం

ప్రమాదాలను నివారించాలి:-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి సంస్థ ఆర్.జి. త్రీ డివిజన్ పరిధిలోని బ్లాస్టింగ్ జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడటం విచారకరం. సింగ రేణి సంస్థ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ సంఘటనలో చనిపోయిన నలుగురు మృతదేహాలు గుర్తుపట్టని విధంగా విచ్ఛిన్నం కావడం సంఘటన తీవ్రత ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే మరో ముగ్గురు గాయాలు పాలుకావడం దురదృష్టకరం. డిటోనేటర్ల అమర్చే క్రమంలో అధికఒత్తిడికారణంగానే భారీవిస్ఫోటం జరిగినట్లు తెలుస్తుంది.
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారంతోపాటు సింగరేణి సంస్థలో పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలి. సంఘ టన తీరుతెన్నులపై పూర్తిస్థాయి న్యాయవిచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సింగరేణి సంస్థ అప్రమత్తం కావాలి.
కల్తీని నిరోధించాలి: -సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆహారపదార్థాలలో కల్తీ తారాస్థాయికి చేరుకున్నా ప్రభుత్వ పరంగా నియంత్రణశూన్యం. వంటనూనెలు, పప్పుదినుసులు, పాలు వంటివాటిలో హానికర రసాయనాలు, జంతు అవశే షాలను కలిపి కల్తీచేసి లక్షలాది ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడు కుంటున్నాయి.
హోటళ్లలో ఆహారపదార్థాలు విచ్చలవిడిగా కల్తీ అవ్ఞతున్నాయి.పళ్లను కృత్రిమ పద్ధతులలో మగ్గించి బజార్లలో అమ్ముతున్నారు. దేశంలో 65శాతం ఆహార పదార్థాలు కల్తీవే అని భారత ఆరోగ్యపరిరక్షణ సంస్థ ఇటీవలే ప్రకటించింది.
కల్తీ లేనివిగా భావిస్తున్న ఆర్గానిక్ ఆహారపదార్థాలు సామాన్యు లకు అందుబాటులో ఉండవ్ఞ.ప్రస్తుత తరుణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో పనిచేసి కల్తీని నిరోధించే చర్యలు చేపట్టాలి.
విస్తరిస్తున్న వ్యాధులు: -సి.హెచ్.సాయిరుత్విక్,నల్గొండ
జాతీయ నమూనా సర్వే తాజా నివేదిక ప్రకారం 2010- 2015 మధ్యకాలంతో పోలిస్తే గత అయిదు సంవత్సరాలలో సాంక్రమిక వ్యాధులు సంక్రమించినవారి సంఖ్యలో 29 శాతం వృద్ధి నమోదు కావడం ఆందోళనకర అంశం.
మలేరియా, హెపటైటిస్,డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్‌గున్యా, మెదడువాపు, బోదకాలు వంటి సూక్ష్మజీవుల నుండి సంక్రమించే వ్యాధుల బారినపడిన వారి సంఖ్యలో వృద్ధి క్షేత్రస్థాయిలో సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వైఫల్యం సూచిస్తోంది.
పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరి:-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
పల్లెచరితం స్వచ్ఛభరితం అనేనూతన కార్యక్రమంద్వారా మండలంలో గల రెండు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఇటీవల ప్రారంభించింది.
ఈకార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ ఎంతవరకు అమలవ్ఞతుందో తెలియదుకానీ ప్రతి ఇంటి నుండి రోజుకు రెండు రూపాయలు గ్రామీణుల జేబుకు చిల్లుపెట్టేదిగా ఉంది. ఇప్పటికే ఇంటి కొళాయ, గ్రంథాలయ తదితర పన్నుల రూపేణా భారీగా వసూలు చేస్తున్నారు.
‘మనం.. మన పరిశుభ్రతతో అదనంగా ఏడువందల ఇరవై రూపాయల బాదుడు సమంజసం కాదు. ఆదాయం లేక ధరలు పెరుగుదలతో సామాన్యుడు తిండికే సతమతమవ్ఞతుంటే పరిశుభ్రత పేర మరో బాదుడు సమంజసం కాదు.
అసంఘటితంగా మారిన రవాణా రంగం : -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
దేశంలో రవాణా రంగం చాలావరకు అసంఘటితంగా ఉంది. వృత్తిపరమైన నిర్వహణ విధానం లోపించింది. అధిక ఆదాయ వ్యయాలు, పెరిగిన చమురు ధరలు, వాహన నిర్వహణ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది.
నకిలీ విడిభాగాలు, ఇరుకైన అధ్వాహ్న స్థితిలో ఉన్న రహదారులు అధిక వడ్డీ, ట్రాఫిక్ నియంత్రణ లోపించడం, సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ, వృత్తినిపుణులు తక్కువగా ఉండడం, వంటి అంశాల కారణంగా రవాణా రంగం అనుకున్న ప్రగతి సాధించడం లేదు.
ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే భారతీయ రవాణా రంగం బాగా వెనుకబడి ఉందన్నది నిర్వివాదాంశం. రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయడం ఎంతో అవసరం.
ప్రపంచ ప్రమాణాలతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం అత్యవశ్యకం.
న్యాయస్థానం తీర్పులను గౌరవించాలి:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా
రాష్ట్రంలో అధికారంలోకివచ్చిన వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అనేక వివాదాస్పద రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను తీసుకోవడం, సామాన్య ప్రజల నుండి ఐ.ఎ.ఎస్ స్థాయి అధికారుల వరకు న్యాయం కోసం న్యాయస్థానాలనాశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజాగా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై న్యాయస్థానం తీర్పు ప్రభుత్వ ఒంటెద్దు, దుందుడుకు పోకడలకు అద్దంపడుతున్నది.
ఇప్పుడు వేసిన రంగులు తొలగించడానికి మరింత ఖర్చు అవ్ఞతుంది. ఇదంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే కదా!
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/