లక్ష్యాలకు ఆమడదూరంలో మహిళా సాధికారత

WOMEN

ఆకలిదప్పులు, అనారోగ్యం, అశాంతి, ఆందోళనలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ప్రపంచదేశాలన్నీ ఏకం కావాలని విజన్‌ 2030 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన ఐక్య రాజ్యసమితి, మహిళా సాధికారత సాధించని పక్షంలో పై లక్ష్యాలను సాధించడం ఒంటిరెక్కతో పక్షి ఎగరేప్రయత్నం లాం టిదని స్పష్టీకరించింది. అభివృద్ధిచెందిన అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌ వంటి దేశాలు కూడా మహిళా సాధికారత సూచిలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయాయన్న సదరు నివేదిక అభివృద్ధిచెందుతున్న దేశాలలో స్త్రీ-పురుషత్వ సమానత్వం అనేది ఇంకా ఎండమావిగానే ఉందన్న కఠోర సత్యాన్ని స్పష్టీకరించింది. లింగసమానత్వంలో ప్రపంచదేశాలు సగటున 65.7 మార్కులు మాత్రమే సాధించగలగడం వెనుక అభివృద్ధి, మహిళా సాధికారత కలిసి మెలిసి సాగడం లేదన్న చేదు నిజాన్ని తేటతెల్లం చేసింది.

ఇక మహిళా సాధికారతపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారహోరు సాగిస్తుండగా 191 ప్రపంచదేశాల్లో భారత్‌కు 95వస్థానం మాత్రం లభించింది. రాజకీయాలలో మహిళలకు స్థానం అంశంలో అథమంగా 139 ర్యాంకు లభించగా మహిళలకు ఆరోగ్యం, ఆహార భద్రతా, పౌష్టికాహారం, సామాజిక భద్రత, ఆర్థిక పరిపుష్టి వంటి కీలక అంశాలలో 126 ర్యాంకు లభించడం చూస్తుంటే ప్రభుత్వాలు మహిళాభివృద్ధి, మహిళా సాధికారత తదితర అంశాలలో చేపడుతున్న కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలనివ్వ డం లేదని అర్థమవ్ఞతోంది.భారతదేశంలో ప్రసవంసమయంలో ఏటా లక్షన్నర మహిళలు మృత్యువాత పడుతుండగా దాదాపు గా మూడు లక్షలమంది మహిళలు శాశ్వత అనారోగ్యాలకు గురవ్ఞతున్నారు. నిర్భ§్‌ు, ఫోక్సో వంటి కఠినతర చట్టాలు తీసుకువచ్చినా రోజుకు సగటున వందకుపైగా అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నాయి.

దేశంలో అతి దారుణమైన వ్యభిచార వృత్తి లో తొమ్మిదిన్నర లక్షలమందిఅబలలు మగ్గుతున్నారు. రోజుకు సగటున పదిహేను మిస్సింగ్‌ కేసులు నమోదు అవ్ఞతున్నా అదృశ్యం అవ్ఞతున్న మహిళల అతీగతీ ఉండటం లేదు. మన కంటే పరిణామంలో, జిడిపిలోచిన్నదైన డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్‌, స్లోవేనియా వంటి దేశాలు మహిళా సాధి కారత విషయంలో మనకంటే మెరుగైన ర్యాంకులుసాధించడం పట్ల మన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లమంది స్త్రీలు వివిధస్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చక్కని ప్రగతి సాధిస్తున్నారు.

15-18 మధ్య వయస్సుగల మహి ళలో 40 శాతం విద్యార్జనకు దూరంగా ఉంటున్నారు. గత అయిదేళ్లల్లో మోడీ ప్రభుత్వం బేటీబచావో, బేటీ పడావో, మహిళా-శిశు వికాస్‌ వంటి పథకాలు మరింత మెరుగులు దిద్ది అమలు చేయాలి. ఆర్థిక, పౌర చట్టబద్ధ హక్కులపై మహిళల్లో మెరుగైన అవగాహన కల్పించాలి. చట్టసభలలో నిర్దిష్ట కోటా కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణం అమలు చేయా లి. మహిళా సాధికారత అంశంలో ప్రకటనలు, మాటలస్థానం లో చేతలకు, పథకాల పటిష్ట అమలుకు ప్రభుత్వాలు చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • సి.హెచ్‌.ప్రతాప్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/