వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారకులు!

ఆందోళనలో అన్నదాతలు

వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారకులు!
Agrarian crisis

కొత్త ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండాలనే ఆలోచన మంచిదైనప్పటికీ నియంతృత్వ ధోరణితో అమలు చేయాలనే భావనను రైతుల స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే అవుతుంది.

చేతిలో అధికారముందని రైతులను భయభ్రాంతులకు గురి చేయడం గతకాలపు రాచరిక వ్యవస్థను తలపింప చేస్తుంది.

అందుకని దాదాపు 70 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం.

అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు, సూచనలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను అమలు పరచడం సమంజసంగా ఉంటుంది.

రాచరిక వ్యవస్థలోనూ వ్యవ సాయ వృత్తిని నమ్ముకొని నిరంతరం అహర్నిశలు కష్టపడే రైతన్న బతుకు గొర్రెకు తోక బెత్తడు గానే ఉండేది.

దుక్కి దున్ని విత్తనం వేసి, వర్షాధారంగా, లేక ఎడ్లమోటల ద్వారా గూడలు, యాతముల ద్వారా మొలకలు లేదా వరి ఎండిపోకుండా పంట లను బతికించుకోవడానికి నానా తంటాలు పడేవారు.

స్వాతంత్య్రం సిద్ధించిన పిదప పాలకులు స్వావ లంబన పేరుతో ప్రధాన వృత్తి అయిన వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచి హరిత విప్లవం తేవాలని, అందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అధునాత యంత్రాలను వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టడానికి కృషి చేశారు.

ఏదిఏమైనా వ్యవసాయంలో మార్పులు సంభవించిన పిదప రైతన్నకు కూడా కష్టాలు పెరిగాయి తప్పా తగ్గలేదు.

వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి సమకూర్చుకో వడం ప్రధాన సమస్యగా మారింది.

మొదట దుక్కిచేయాలి. విత్త నాలు కొనుగోలు, ఎరువ్ఞలు, క్రిమిసంహారక మందులు, కూలీలకు డబ్బులివ్వడం ఇవన్నీ అమలు కావాలంటే డబ్బు కావాలి. గతానికి ఇప్పటికీ చాలా మార్పుఉంది.

అప్పట్లో ఎడ్లతో వ్యవసాయం, పంట నుండి మెరుగైన విత్తనాలను సమకూర్చుకోవడం, ఎరువులకు బదులుగా ఎడ్ల పేడ, పెంట లాంటివి, కూలీలకు ధాన్యమివ్వడం జరిగేది.

వ్యవసాయ నిర్వహణకు పంట రుణాలు రైతులకు సమ కూర్చాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకర్ల సమావేశాలు జరిపి టార్గెట్‌లు విధించినప్పటికీ ప్రణాళికబద్ధంగా రుణాలు అందించబడ టం లేదని లెక్కలు తెలుపుతున్నారు. సాగునీటి సౌకర్యం లేక మెట్టప్రాంతాల రైతులు బావులు తవ్వుకోవటం జరుగుతుంది.

దీనికి గలకారణాలను అన్వే షించడానికి గత కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్‌ కమిషన్‌ను, జయతీఘోష్‌, రామనారాయణరెడ్డి లాంటి కమిషన్‌లు నియమించారు .

అట్టి కమిషన్‌లు భూమి పట్టాలు, గిట్టుబాటు ధరలు అన్ని అంశాలపైన రిపోర్టులు ఇచ్చాయి.కాని వాటిని అమలు చేయడానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నించలేదు. సిద్ధం కాలేదు.

ధరల నిర్ణయాల కమిటీలో ఒక రైతుకు స్థానం కల్పించకపోవడం పాలకుల దుర్నీ తికి అద్దంపడుతున్నది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం వడ్ల ధర క్వింటాలుకు రూ. 2700లు ఉండాలి.

ఇప్పుడున్నది కేవలం రూ. 1835 ఉండటం రైతు ఏ రకంగా దోపిడీకి గురి అవుతున్నాడో గమనించండి.

అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ధారిస్తూ కమిషన్‌లు సిఫారసు చేసినా పట్టించుకోకుండా ఉప శమనాలతో రైతులను మభ్యపెట్టే కుట్రలను గతప్రభుత్వాలు అను సరించాయి.

నేటి పాలకులు కూడా అదే చేస్తున్నారు. గిట్టుబాటు ధరకు బదులుగా మద్దతు ధరలిస్తున్నారు.

అవి కూడా ప్రభుత్వాల దయాదాక్షిణ్యం మీదనే ఇవ్వబడుతున్నాయి. జై జవాన్‌, జై కిసాన్‌ అంటారు. బార్డరులో సైనికులు దేశరక్షణకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పాలకులు సున్నం పెడుతున్నారు.వ్యవసాయాన్ని సంక్షోభంలోకినెట్టి రైతు ఆత్మహత్య లకు కారణమవ్ఞతున్నారు.

తెలంగాణ ప్రభుత్వ అధినేత కెసిఆర్‌ ఎకరానికి సంవత్సరం పెట్టుబడి సహాయం కింద రూ.10వేలు రైతుబంధు పథకం పేరుతో ఇస్తున్నారు.

రైతుల అప్పులను 2005 లో యుపిఎ ప్రభుత్వం మాఫీ చేయగా, కెసిఆర్‌ ప్రభుత్వం గత పాలన సమయంలో అప్పులు మాఫీ చేసింది.

ఇప్పుడేమో ఒక లక్ష అప్పువరకు నాలుగు విడతలలో చేస్తాననిప్రకటించింది. రైతు సంక్షేమమే,రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తియ్య టి మాటలతో ఉవ్విళ్లూరిస్తున్నారు.

రైతు ఆత్మహత్యకు ప్యాకేజీ, రైతు మరణిస్తే ఇన్సూరెన్స్‌ ఇవి ప్రధాన నినాదాలుగా చోటు చేసుకోవడం పట్ల ప్రజలలో, మేధావులలో చర్చజరగాలి.

కెసిఆర్‌ ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం చెప్పిన పంట వేయకపోతే’ రైతుబంధు పథకం కటాఫ్‌ అంటూ వర్తించదని హెచ్చరిస్తున్నారు.

రైతు ఇష్టమున్న పంటవేసి పండిస్తే కొనుగోలు చేయమని తెగేసి చెప్పుతున్నారు.ఇది ముమ్మా టికి బెదిరింపే అవుతుంది.

రైతులకు హెచ్చరికమేమిటి? భూసార పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ కోణం నుండి పంటల మార్పిడిపై రైతులకు సలహాలివ్వడం సమంజసంగా ఉంటుంది.

తెలంగాణ ప్రాంతం ఎత్తు,పల్లాలతో కూడుకున్నది. ఇందులో పంటసాగు ఎక్కువగా ఉంటుంది. నల్లరేగడి నేలలు, ఎర్రమట్టి నేలలు, సౌడు నేలలు,దుబ్బనేలలు రకరకాలుగా ఉంటాయి.

నీరు ఎక్కువగాలభించే ప్రాంతంలో వరిపంట పండించుకునేది ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తోంది

కరెంట్‌ మోటర్ల ద్వారా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే దగ్గరవరి, ఇతర పంటలు వేయడం సహజం.

నల్లరేగడి భూములలో వర్షాలు పడగానే రోహిణికార్తెలోనే వర్షాల పైన ఆధారపడే భూముల్లో విధిగా మొక్కజొన్న లేదా వేరుశనగ, పెసర,బొబ్బర్లు లాంటి మూడు మాసాలలోపే చేతికొచ్చే పంటలు వేసుకుంటారు.

అలాగే కొంతమంది పత్తి,వరి వేయడం లాంటి పంటలువేయడం ఆనవాయితీగా వస్తున్నది.ఇప్పటివరకు భూసార పరీక్షలు అన్ని భూములపై చేయలేదు. ఎలాంటి నేలలో ఏ పంట వేయాలో శాస్త్రీయంగా నిర్ధారించలేదు

వ్యవసాయ శాస్త్రజ్ఞులు,వ్యవసాయ నిపుణులు పంటలు వేసు కోవాలో తెలియపరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

కాని రైతు సమ న్వయసమితి ద్వారా అమలుపరుచుతామని ప్రభుత్వం ప్రకటించ డం రాజకీయ జోక్యమే అవుతుంది.

రైతు సమన్వయకమిటీలు అన్ని కూడా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలతో నామినేట్‌ చేయబడిన విష యం అందరికి తెలిసిందే.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చించాలని రైతులను చైతన్యపరిచి వారికి నచ్చచెప్పి ఏయే నేలలో ఏయేపంటలు వేసుకోవాలో తెలియపరచడం ఉపయుక్తంగా ఉంటుంది.

కొత్త ఉత్పత్తులకు డిమాండ్‌ఉండాలనే ఆలోచన మంచిదైన ప్పటికీ నియంతృత్వ ధోరణితో అమలు చేయాలనే భావనను రైతు ల స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే అవుతుంది.

చేతిలో అధికారముం దని రైతులను భయభ్రాంతులకు గురి చేయడం గతకాలపు రాచ రిక వ్యవస్థను తలపింప చేస్తోంది.

  • -చాడవెంకటరెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/