Auto Draft

రాజకీయ అవినీతి నిర్మూలన జరగాలి

Corruption
Corruption

అవినీతి నిర్మూలనకు చాలా మార్గాలున్నాయి. ప్రజలతో నిత్యసంబంధాలు కలిగిన ప్రభుత్వ శాఖలలో చాలావరకు మానవ ప్రమేయాన్ని తగ్గించాలి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ టెక్నాలజీని పెంచాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు అవినీతిపరులను పసిగట్టడం చేయాలి. అవినీతి తిమింగలాలను పట్టుకోవడమే కాకుండా వారి కేసులను త్వరితగతిన విచారణ జరపాలి.

అంతిమంగా అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసి ప్రజలపరం చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైనది రాజకీయ అవినీతి అధికారుల, ఉద్యోగుల అవినీతికి కారణం అవుతుంది.

పోస్టింగులు నుండి బదిలీల వరకు రాజకీయ అవినీతితో అధికారులు చెలరేగిపోతున్నారు. రాజకీయ నాయకులతోపాటు అవినీతి అధికారులు కూడా అవినీతి సామ్రాజ్యాలను ఏలుతున్నారు.

ఈ అవినీతి సామ్రాజ్యాలు కులాలంటే ముందు రాజకీయ అవినీతి నిర్మూలన కావాలి. లేకపోతే అవినీతి నాగరాజులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు. అభివృద్ధి సామ్రాజ్యాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి.

రె వెన్యూశాఖలో అవినీతి సొమ్ము కోటి రూపాయలు దాటిన లంచం తీసు కున్న కేసులో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాల్సిన కేసుగా కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు కేసు మొదటిది.

జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న చంచల్‌గూడా జైలులోనే ఆయన ఉరి వేసుకోవడంతో నాగరాజు అవినీతి కథ విషాదాంతమైంది.

ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. పాపభీతి ఉన్నవాళ్లు స్వర్గం నరకం ఎక్కడో లేదని అది ఇక్కడే ఉందని ఆయనకు తగిన శాస్త్రి జరిగిందని అనుకుంటారు.

కానీ సమాజంలో అవినీతి కూకటివేళ్లతో తొలగాలి అనుకునేవాళ్లు, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్లు న్యాయనిర్బంధంలో ఉన్న నాగరాజుకు అన్యాయం జరిగిందని అంటారు.

ఇప్పటికే ఆయన మృతిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అనుమానాలు ముసురుకుంటున్నాయి.

న్యాయ నిర్బంధంలో ఉన్న వారికి సరైన రక్షణ లేదు అని అనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. పోనీ ఆయన ఉన్న జైలులోని మంజీరా బ్యారక్‌లో ఆయన ఒక్కరే ఉన్నారా అంటే కాదు.

ఆయనతోపాటు ఇంకా నలుగురైదుగురు ఖైదీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బయట జైలు అధికారులు హోంగార్డుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది.

మరి అలాంటప్పుడు బ్యారక్‌ ఇను పగ్రిల్‌కు ఆయన ఎలా ఉరి వేసుకున్నారు అనేది చిదంబర రహస్యంకాదు.

కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం రెప్పపాటు జీవితం అని ఒక కవి అన్నారు. అలాగే మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి చావుకీ బతుక్కీ మధ్య ఒక్క బల హీన క్షణం చాలు. ఇలా చాలా మంది తమ జీవితాలను ఎన్నో కారణాలతో అర్థంతరంగా ముగించుకుంటున్నారు.

మనిషి అవినీతితో సంపాదించిన ఆస్తిలో ఆ సంపాదన సక్రమమా లేక అక్రమమా అని చూడకుండా భాగం పంచుకునే కుటుంబ సభ్యులు, మిత్రులు స్నేహితులను తమ అవినీతి పాపంలో భాగం పంచుకుంటారా అని అడిగితే సొంత భార్యాపిల్లలతో సహా ఎవరు ముందుకురారు.

ఈ నగ్నసత్యాన్ని తెలుసుకున్న రోజు అవినీతి నాగరాజులు, లావణ్యలు అవినీతి నగేష్‌లు ఇలా బరితెగించి లంచాలు తీసుకోరు. ఆ మధ్య వచ్చిన ‘లీడర్‌ అనే తెలుగు సినిమాలో హీరో రాణా అసెంబ్లీ సీన్‌లో ఒక మాట అంటారు.

‘ఏం అవినీతికి అంతం లేదా పది ఎకరాల ఇరవై ఎకరాలు చాలవా? పది కోట్లు ఇరవై కోట్లు చాలవా? అవినీతితో వందల వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు? అని బహిరంగంగా అడుగుతారు.

ఇలాంటి ప్రశ్నలు అవినీతిపరులు తమకు తామే వేసుకుంటే బతకడానికి ఎంత కావాలి అని ఆలోచిస్తారు. చచ్చాక అరడుగుల నేల చాలు అన్న నిజం తెలుసుకుంటారు.

అవినీతి ఒక జూదం లాంటిది అందుకే ఎంత సంపాదించినా మరింత సంపాదించాలనే యావ పెరు గుతోంది. సంపాదించిన కొద్దీ ఇంకా అత్యాశకు పురిగొల్పు తుంది. అవినీతి ఒక పులి మీదస్వారీ లాంటిది.

ఆ పులి మీద స్వారీ చేస్తున్న అవినీతిపరులు ఒకవేళ తాము స్వారీ చేస్తున్న అవినీతి పులి మీద నుండి దిగితే ఆ పులి తమను తినేస్తుంది అన్నభయంతోనే వాళ్లు తమ పదవుల నుండి రిటైర్‌ అయ్యేదాకా దాని మీద స్వారీ చేస్తూనే ఉంటారు.

పోనీ రిటైర్‌ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా బతుకుతారా అంటే ఆ తర్వాత భయంభయంగా చచ్చేదాకా బతుకుతూ ఉంటారు.

ఇది జీవన వేదాంతం కాదు జరుగుతున్న అవినీతి జీవన ప్రస్థానం. దీనికి నాగరాజు కేసు ఒక ప్రత్యేక్ష ఉదాహరణ. అవినీతికి మొదటి మెట్టుగా మారిన వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతోనే ఈ అవినీతికి మంగళం పాడినట్లు కాదు.

అలాగే కొంత మంది ఎమ్మార్వోలను మరికొంత మంది ఉన్నత అధికారులను అరెస్టు చేసి కేసులు పెడితే కూడా ఈ అవినీతి పోదు. రెవెన్యూ శాఖ లో వీఆర్వో లాగానే ఎమ్మార్వోలు కూడా మరొక మొదటి మెట్టుగా ఇప్పుడు అవినీతి కేసుల్లో బలవుతున్నారు.

వారికంటే పై అధికారుల లంచగొండితనం కింది స్థాయి అధికారులను లంచాలు తీసుకోవడానికి తప్పనిసరి అవసరంగా పురిగొల్పుతుంది.

ఇది ఒక విషవలయం. వ్యవస్థాగతమైన మార్పులతోనే అవినీతిని అంతం చేయగలం. ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం విధానాలు ప్రవేశపెట్టడంతోనే అవినీతి నిర్మూలన జరుగుతుంది. అవినీతి వ్యక్తిగతం కాదు.సామాజికం.

సామాజికంగా కొన్ని పాలనా సంస్కరణలు వస్తేనే అవినీతి రూపుమాపడానికి వీలవ్ఞతుంది. లేకపోతే ‘దొరికితే దొంగ దొరకకపోతే దొర లాగా తయారవుతుంది.

ఇలాంటి అవినీతి తిమింగలాలు ఒక్క రెవెన్యూశాఖలోనే కాదు ప్రజలలో నిత్య సంబంధాలు గల అనేక ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి.

ఎటొచ్చి అందరు అవినీతిపరులు ఎసిబికి చిక్కిడం లేదు. అవినీతిపరులు దొరికినా కూడా వారి కేసులు విచారణ జరిగి శిక్షలు పడే కల్లా వారు రిటైర్‌ అవ్ఞతున్నారు. అంతకుముందు ప్రమోషన్ల మీద పెద్ద పెద్ద పదవ్ఞలలో ఉంటున్నారు.

వారి అక్రమ ఆస్తులకు ఎలాంటి భంగం కలగడం లేదు. కనుక ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ డిపార్ట్మ్‌ంట్‌ నుంచి మొదలుకొని రిజిస్ట్రేషన్‌ శాఖలలో అధికారుల విచక్షణ అధికారాన్ని తొలగించింది.

పోలీసుశాఖలో ఇటీవల పట్టుబడిన ఎసిపి నరసింహారెడ్డి ఉదంతం ఇంకా మన జ్ఞాపకాల్లోనే ఉంది. అలాగే మున్సిపాలిటీలలో పట్టుబడుతున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇతర అధికారులు కేసులు ఒకసారి పరిశీలిస్తే ఆయా శాఖలలో మానవ ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అవినీతి నిర్మూలనకు చాలా మార్గాలు న్నాయి. ప్రజలతో నిత్యసంబంధాలు కలిగిన ప్రభుత్వ శాఖలలో చాలా వరకు మానవ ప్రమేయాన్ని తగ్గించాలి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ టెక్నాలజీని పెంచాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు అవినీతిపరులను పసిగట్టడం చేయాలి. అవినీతి తిమింగలాలను పట్టుకోవడమే కాకుండా వారి కేసులను త్వరితగతిన విచారణ జరపాలి.

అంతిమంగా అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసి ప్రజలపరం చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైనది రాజకీయ అవినీతి అధికారుల, ఉద్యోగుల అవినీతికి కారణం అవుతుంది.

పోస్టింగులు నుండి బదిలీల వరకు రాజకీయ అవినీతితో అధికారులు చెలరేగిపోతున్నారు. రాజకీయ నాయకులతోపాటు అవినీతి అధికారులు కూడా అవినీతి సామ్రాజ్యాలను ఏలుతున్నారు.

ఈ అవినీతి సామ్రాజ్యాలు కులాలంటే ముందు రాజకీయ అవినీతి నిర్మూలన కావాలి. లేకపోతే అవినీతి నాగరాజులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు. అభివృద్ధి సామ్రాజ్యాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. అప్పుడుమనం ఇలా చూస్తూనే ఉంటాం.

  • బండారు రామ్మోహనరావు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/