ప్రగతి భవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

సీఎం కెసిఆర్ కు వేదపండితుల వేదాశీర్వచనం

CM KCR at Ugadi celebrations at Pragati Bhavan
TS CM KCR at Ugadi celebrations at Pragati Bhavan

శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు.

ఈ ఏడాది 75 శాతం అంతా మంచే ..

తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని సంతోష్ కుమార్ తెలిపారు. పాలనా పరంగా కూడా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆ చెప్పారు.

‘మండలి’ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/