ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కాబోతుంది

నిన్నటి వరకు ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ ‘ ఒక్క ఎపిసోడ్ గానే ఉంటుందని అనుకున్నారు..కానీ రెండు ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ 2 కు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు తన స్నేహితుడు గోపీచంద్ సైతం హాజరై సందడి చేసారు. దీనికి సంబదించిన ప్రోమో ఎపిసోడ్ ఫై మరింత ఆసక్తి పెంచేసింది. ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా..అని యావత్ సినీ లోకం ఆసక్తి గా ఎదురుచూస్తుంది.

ఈ ఎపిసోడ్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా రెండు రోజుల మందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్‌ 30న ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు 100 నిమిషాల ‘బాహుబలి’ ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా చేసి.. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1: ది బిగినింగ్‌ను డిసెంబర్ 30న, పార్ట్ 2: ది కన్‌క్లూజన్‌ను జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతోంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే హిస్టరీలో ఒక ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా అందించడం ఇదే మొదటిసారని ఆహా చెబుతోంది. డిసెంబర్ 30న ప్రసారం కాబోయే తొలి భాగంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ మధ్య జరిగే ముచ్చట్లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయట. ఇక డిసెంబర్ 6న ప్రసారం కాబోయే రెండో భాగంలో హీరో గోపీచంద్ జాయిన్ అవుతారు. ఈ భాగంలో ప్రభాస్, గోపీచంద్ సినీ కెరీర్ గురించి.. వారి స్నేహం గురించి బాలయ్య ప్రశ్నలు సంధిస్తారట.

అయితే, తొలి భాగంలో ప్రభాస్‌ను కొన్ని కొంటె ప్రశ్నలు అడిగారట బాలయ్య. ఇటీవల బాగా వైరల్ అయిన కృతిసనన్‌తో డేటింగ్ అనే రూమర్‌పై బాలకృష్ణను ప్రశ్నలు అడిగారట. దీంతో పాటు ఫన్ గేమ్ కూడా ఒకటి ఉందని ఆహా టీమ్ పేర్కొ్ంది.