సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ వర్కింగ్ స్టిల్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సలార్ మేకర్స్ ప్రభాస్ తాలూకా షూటింగ్ లొకేషన్ పిక్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఆ పిక్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రభాస్ పిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్రభాస్ పోస్ట‌ర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈరోజు విడుదల చేసిన పిక్స్ లలో ప్రభాస్‌ కంటెయినర్‌పై మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్ ఇస్తున్నాడు. ప్రభాస్‌ మాసీ లుక్ సలార్‌ సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు పెంచేస్తుంది.

అలాగే ప్రభాస్..నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్‌ కే లుక్‌ ఒకటి కూడా విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్‌ మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో మైథాలాజికల్‌ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్‌ కూడా చేస్తున్నాడు‌.