ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం ఫై కిషన్ రెడ్డి ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌పై తెలంగాణ అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్ విధించారు. స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసారని..దానికి సారీ చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరగా..ఈటెల సారి చెప్పకపోవడం తో అసెంబ్లీ స‌బ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు రాజేంద‌ర్‌ను స‌స్పెండ్ చేయాలనీ కోరగా..స్పీకర్ ఆమోదించారు.

అయితే ఈటెల ను సస్పెండ్ చేయడం ఫై బిజెపి నేత , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన్ను సభలో చూడటం ఇష్టం లేకపోతే.. టీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీకి రావొద్దు అంటూ మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ మరమనిషి అన్నారని తెగ ఫీలయిపోతున్నారు.. అదేమైన అన్‌ పార్లమెంటరీ భాషనా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం మీరు మహిళలను గౌరవించరు.. గవర్నర్‌కి విలువ ఇవ్వరు.. ఇదేం పద్ధతి అంటూ టీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏదైనా మాట్లాడితే బూతు అంటారని.. మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చు.. ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పదిమందికి ఆదర్శంగా ఉండాలని.. కాని అలా వ్యవహరించడం లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.