ప్రభాస్ బర్త్ డే రోజున మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు ప్రభాస్ కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి పలు వ్యాఖ్యలు చేసారు. ఈ కామెంట్స్ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మరో తల్లికి పుట్టిన నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే పుట్టినరోజు నాటికి అతడు పెళ్లిచేసుకుంటాడో లేదో నాకు తెలీదు కానీ కచ్చితంగా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అయితే ఇస్తాడు. నా ప్రేమాభిమానాలు నీకెప్పుడూ ఉంటాయి డార్లింగ్ బ్రదర్ ప్రభాస్’’ అని విష్ణు మంచు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే చిలిపిగా ప్రభాస్ పెళ్లి గురించి సెటైర్ కూడా వేశారని , కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మంచు విష్ణు విషయానికి వస్తే…శుక్రవారం జిన్నా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో అన్ని థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.