ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

ప్రభాస్ 20వ చిత్రంగా రాధే శ్యామ్

Radhe Shyam First Look First Impression: Prabhas' New Mega-Budget ...

హైదరాబాద్‌: ప్రభాస్‌ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ వచ్చింది. ‘బాహుబలి’ తరువాత గత సంవత్సరం ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ముగిసిన తరువాత, ఇంటికి చేరుకున్న యూనిట్ సభ్యులంతా కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యారు. తదుపరి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు. తెలుగు, త‌మిళం, హింధీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/