పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ప్రభాస్

Hero Prabhas
Hero Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేపు (అక్టోబర్ 23) 43 వ ఏటా అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భాంగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు గ్రాండ్ గా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో కొన్ని రోజులు ప్రభాస్ షూటింగులకు దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా రేపటి పుట్టినరోజు వేడుకలకు సైతం ప్రభాస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు అభిమానులు నిరాశ చెందకుండా మూవీ మేకర్స్ మాత్రం ప్రభాస్ సినిమాలకు సంబంధించిన టీజర్స్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు రేపు ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్టు కే’ నుంచి కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి మూడు రోజులపాటు టెస్ట్ షూట్ చేయనున్నారని సమాచారం. అలాగే రేపు ప్రభాస్ నటించిన బిల్లా మూవీ 4k వెర్షన్ లో రిలీజ్ కాబోతుంది.