రాజ్యసభ ముందుకు జమ్ముకశ్మీర్‌ బిల్లు

న్యూఢిల్లీ: రాజ్యసభ ముందు గురువారం జమ్ముకశ్మీర్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లు వచ్చింది. ఈ మేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. జమ్ము కశ్మీర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/